లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే… నెలకు రూ.30 వేలు లాభం…ముంబై కేంద్రంగా దందా..

షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులపేరుతో మోసానికి పాల్పడిన ముంబై కేంద్రంగా స్టాక్‌ బ్రోకరింగ్‌ నిర్వహిస్తున్న మనోజ్‌ జావెరీ స్టాక్‌ బ్రోకరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కనార్డ్‌ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ట్రిలియన్‌ క్యాపిటల్‌ సంస్థలకు డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజ్‌దీప్‌ మనోజ్‌ జావెరీ, ఈ సంస్థలకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న అనిల్‌ కరకాల ఉపాధ్యాలను శనివారం సీసీఎస్‌ ఏసీపీ ఎస్వీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన ప్రదీప్‌ యార్లగడ్డతో పాటు మరో ఆరుగురి వద్ద నుంచి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులంటూ రూ. 7 కోట్లు వసూలు చేసిన ఈ ముఠా.. భారీ మోసానికి పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి మొదటి సారిగా షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ వ్యవహారాల్లో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అరెస్ట్‌ చేశారు.

పోలీసులు అరెస్ట్‌ చేసిన రాజ్‌దీప్‌ మనోజ్‌ జావెరీ తండ్రి మనోజ్‌ మోహన్‌చంద్ర జావెద్‌ ఈ సంస్థలను 12 ఏండ్ల క్రితం ముంబైలో ఏర్పాటు చేశాడు. స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ వ్యాపారంపై అవగాహన ఉండటంతో తెలిసినవారు, స్నేహితుల వద్ద నుంచి షేర్స్‌లో పెట్టుబడులు పెట్టిస్తూ ఒక వ్యవస్థను నడిపించారు. ఆ తరువాత అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టారు. ఆన్‌లైన్‌లో తాము స్టాక్‌ బ్రోకర్స్‌మని, మీ పెట్టుబడులకు నెలకు భారీ లాభాలిస్తామంటూ ప్రచారం చేశారు. కొందరికి ఈమెయిల్స్‌, మరికొందరికి మెసేజ్‌లు పంపించారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే… నెలకు రూ.30 వేలు లాభంగా ఇస్తామంటూ నమ్మించారు. ఈ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ చూసిన చాలామంది అందులో ఉండే నంబర్లకు ఫోన్‌ చేసేవారు. దీంతో అప్పుడు ఏజెంట్ల వ్యవస్థను ఈ ముఠా రంగంలోకి దింపుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టేందుకు వాకబు చేశారో వారి గురించి తెలుసుకుంటూ.. అలాంటి వారిపై దృష్టి పెట్టేవారు. ముంబై నుంచి కొందరు ప్రధాన ఏజెంట్లు వారికి సబ్‌ ఏజెంట్లుగా ఆయా రాష్ర్టాల్లో కొందరిని నియమించుకున్నారు. ఈ ప్రధాన ఏజెంట్లలో ఒకరు సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన అనిల్‌ కరకాల ఉపాధ్యాయ.

ఈ ముఠా… తమ మాటలు నమ్మివచ్చేవారి నుంచి మొదట లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిస్తారు.. మా వద్ద పెట్టుబడి పెడితే మేం స్టాక్‌ మార్కెట్‌లో వాటిని పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఇస్తామని, లక్ష రూపాయలకు నెలకు.. రూ. 30 వేలు లాభంగా చూపిస్తామని నమ్మించేవారు. అయితే.. మొదటి రెండు నెలలు రూ.30వేలు ఇవ్వడంతో బాధితులకు వీరిపై నమ్మకం ఏర్పడేది. ఆ తర్వాత బాధితుల ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడుల రూపంలో వసూలు చేసేవారు. వీరు మరికొందరితో పెట్టుబడులు పెట్టించేవారు.. ఇలా పెట్టుబడుల రూపంలో వందల కోట్ల వరకు ఈ ముఠా వసూలు చేసేది.. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన బాధితుడు మొదట కొంత డబ్బు పెట్టుబడి పెట్టి, ఆ తరువాత వారి మాటలతో ఇతర కుటుంబ సభ్యులు కూడా అందులో రూ.7 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. పెట్టి న పెట్టుబడుల్లో 40 నుంచి 50 శాతం తిరిగి ఇచ్చేస్తారు.. అప్పటికే బ్రోకరేజి సంస్థకు ఒకరి తరపుననే కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయి. ఇలా దేశ వ్యాప్తంగా 300 మంది నుంచి రూ. 600 కోట్ల వరకు ఈ సంస్థలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ముంబై మాఫియా.. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు బాధితులకు నకిలీ పత్రాలు చూపిస్తున్నారు. డీమ్యాట్‌ ఖాతా మొదలుకొని, ఫలాన షేర్స్‌లో పెట్టుబడి పెట్టాం… దానిలో ఇంత లాభం వచ్చింది… ఆ తరువాత అన్ని నష్టాలు వచ్చాయంటూ అన్ని నకిలీ స్టేట్‌మెంట్లు తయారు చేసి బాధితులకు ఇస్తారు. బాధితులు ఎవరైనా.. వాటితో మాకు సంబంధం లేదు.. నెలవారీగా రూ. 30 వేలు..రూ. లక్షకు లాభం ఇస్తామని చెప్పారు.. అవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతారు. దీంతో ఆ ముఠా.. ఇదంతా సివిల్‌ వ్యవహారం… ట్రిబ్యునల్‌కు వెళ్లాలంటూ బెదిరింపులకు దిగుతారు. అప్పటికే కొందరు పెట్టిన పెట్టుబడుల్లో 40 శాతం వరకు తిరిగి వచ్చాయని, ముంబైకి వెళ్లి వారి తో గొడవ ఎందుకని ఊరుకుంటారు. మరికొందరు మ ధ్యవర్తి చెప్పినట్లు ఎంతో కొంత తీసుకుంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ర్టాల్లో ఈ ముఠా చేతిలో మోసపోయిన బాధితులున్నారు. అర్బిట్రేషన్‌ అనే పదంతో ముంబై స్టాక్‌ బ్రోకరేజి మాఫియా మో సాలకు పాల్పడుతుంది. అయితే వాస్తవంగా వ్యాపారం చేసి, నిబంధల ప్రకారం వ్యాపారం జరిగినప్పుడు మొద టి అర్బిట్రేషన్‌(రాజీ)కు ఎక్కువ అవకాశముంటుంది. అ లాకాకుండా నిబంధనలకు విరుద్ధంగా అంతా మోసంతో నడిచినప్పుడే నేరుగా బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు అవకాశముంది. అయితే..ముంబై మాఫియా బాధితులపై బెదిరింపులకు దిగడంతో చాలామంది బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించడంలేదు.

చీటింగ్‌ చేసే వారిపై హైదరాబాద్‌ పోలీసులు ఉక్కుపా దం మోపుతున్నారు. ఇతర రాష్ర్టాల పోలీసులు ఫిర్యాదు లు వచ్చినా.. పలు చీటింగ్‌ కేసులను పక్కన పెట్టిన దాఖలాలున్నాయి. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందిందంటే మోసం చేసిన నేరస్తులు ఎంత పెద్దవారైనా, ఎక్కడున్నా అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతున్నారు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడుల రూపంలో రూ. 7 కోట్లు తీసుకున్న బ్రోకరింగ్‌ సంస్థలపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రోకరింగ్‌ సంస్థ చేసిన మోసాలన్నింటికీ సంబంధించిన ఆధారాలు సేకరించి ముంబైకి వెళ్లిన ప్రత్యేక బృందం.. ప్రధాన ఏజెంట్‌తో పాటు సంస్థల డైరెక్టర్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ సంస్థ ల వ్యవస్థాపకుడైన మనోజ్‌ మోహన్‌చంద్ర నెల రోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. ఇప్పుడు ఆ సం స్థల వ్యవహారాలన్నీ వాళ్ల కుటుంబ సభ్యులే చూస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *