పబ్లిక్ సర్వీస్ సెంటర్: ఇంటి వద్ద నుంచే ఉపాధి

కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పన కోసం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ పబ్లిక్ సర్వీస్ సెంటర్ల సంఖ్యను కూడా పెంచాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఒక పబ్లిక్ సర్వీస్ సెంటర్‌లో ముగ్గురి నుంచి నలుగురి వరకు పని చేయొచ్చు. అంతేకాకుండా ఇలా వీటిల్లో పని చేసే వారి ఆదాయం కూడా పెంచాలని నిర్ణయించింది. ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఇదివరకు మాదిరిగా రూ.4 కాకుండా ఇకపై రూ.11 అందించనుంది. కాగా కామన్ సర్వీస్ సెంటర్లు CSC పీపీపీ మోడల్‌పై పని చేస్తాయి. మీరు కూడా సీఎస్‌సీ సెంటర్‌కు ఓపెన్ చేయాలని భావిస్తే లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు సెంటర్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. మీ ఊరు లేదా పట్టణంలో సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. కామర్ సర్వీస్ సెంటర్లలో ప్రజలు చాలా సర్వీసులు పొందొచ్చు.

ఆధార్ కార్డు అప్‌డేట్ దగ్గరి నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ల వరకు చాలా సేవలు పొందొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలా ఎన్నో రకాల సేవలు పొందొచ్చు. అయితే మీరు కామన్ సర్వీస్ సెంటర్ ఓపెన్ చేయాలని భావిస్తే కనీసం 100 నుంచి 200 చదరపు మీటర్ల రూమ్ ఉండాలి.

రెండు కంప్యూటర్లు ఉండాలి. పవర్ బ్యాకప్ అవసరం. ప్రింటర్ తప్పనిసరి. ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి.

ఇంకా సీఎస్‌సీ సెంటర్ ఓపెన్ చేయాలంటే 18 ఏళ్లకు పైన వయసు కలిగి ఉండాలి. 10 పాస్ కావాలి. ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. www.csc.gov.in వెబ్‌సైట్ ద్వారా మీరు సీఎస్‌సీ సెంటర్ కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డులో పేరు, ఆధార్ కార్డులో పేరు రెండూ ఒకేలా ఉండాలి. క్యాన్సల్డ్ చెక్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ సహా ఇతర వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు ఇంకా సీఎస్‌సీ సెంటర్ ఓపెనింగ్‌కు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే 1800 3000 3468కు కాల్ చేయొచ్చు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *