మ‌ళ్ళీ కరోనా వైరస్ సోకితే ప్రమాదమా?

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. వైరస్ నుంచి కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నది. ఈ వైరస్ కు ఖచ్చితమైన ట్రీట్మెంట్, వాక్సిన్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఎప్పటి వరకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అయితే, కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులకు రెండోసారి కరోనా రాదు అని చెప్పడానికి అవకాశం లేదు. శరీరంలోని రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. రెండోసారి కరోనా వైరస్ సోకడంపై అమెరికాలోని నెవెడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇటీవలే అమెరికాలో మొదటి రీ ఇన్ఫెక్షన్ కేసును నిర్ధారణ చేశారు. 48 రోజుల వ్యవధిలోనే ఒకే వ్యక్తికీ రెండుసార్లు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. మొదటిసారి కరోనా సోకిన సమయంలో ఎలాంటి లక్షణాలు లేవని, కరోనా నుంచి కోలుకొని నెగెటివ్ వచ్చిన వ్యక్తికీ 48 రోజుల తరువాత రెండోసారి కరోనా సోకింది. రెండోసారి వైరస్ సోకిన వ్యక్తిలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు ఇబ్బందులు పెట్టినట్టు వైద్యులు తెలిపారు. మొదటిసారి ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి కోలుకున్నాక రెండోసారి ఇన్ఫెక్షన్ సోకదని చెప్పలేమని పరిశోధకులు చెప్తున్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *