450 సంవత్సరాల చరిత్ర గల దర్గా తోలగింపు కుట్రలను సహించేది లేదు:ఆల్తాఫ్ అలి రజా

విజయవాడ : 450 సంవత్సరాలుగా విజయవాడ ప్రకాశం బ్యారేజి సమీపంలో వున్న హజరత్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ , హజరత్ హుస్సేన్ షా ఖాద్రీ దర్గాల తోంగింపుకు కుట్రలు చేస్తే సహించేది లేదని సూఫీ మతగురువులు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా హెచ్చరించారు.  మంగళవారం విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద ఉన్న సమీపంలో వున్న హజరత్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ , హజరత్ హుస్సేన్ షా ఖాద్రీ దర్గా వద్ద దర్గాపై అనుసరిస్తున్న వివక్షకు నిరసనగా 116 కొబ్బరి కాయలు కొట్టి నిరసన తెలిపారు.

ఆనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అతి పవిత్రమైన ఈ దర్గాలలోనికి మురుగు నీరు వర్షపు నీటితో నమాజు చేసుకోలేని దుస్థితి నెలకోందని అన్నారు. దర్గా లోపలికి వెళ్ళే దారికూడ ఏర్పాటు చేయకుండా గోడలు కట్టేశారన్నారు.గత నాలుగు సంవత్సరాల క్రితం దర్గా తొలగింపుకుకు నాటి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుట్ర జరిపిందని దానని హైకోర్టులో అడ్డుకున్నామని అన్నారు.

పిమ్మట 68.75 లక్షల రుపాయలు దర్గా అభివృద్ధికై కేటాయింపు జరిపి పైసా ఖర్చు పెట్టలేదన్నారు.ఏమి చేయలేని పరిస్థితిలో డ్రైనేజీ వాటర్ వర్షపు చొచ్చుకు వచ్చే విధంగా పరిస్థితని కల్పించారని ఆవేధన వ్యక్తం చేశారు.ఆ విషయమై ఉప ముఖ్యమంత్రి , మైనారిటీ శాఖా మంత్రి అంజాద్ బాషా దృష్టికి తీసుకెళ్ళగా ఆయన స్పందించి తక్షణమే జిల్లా కలెక్టర్ ,వక్ఫ్ బోర్డు సిఇఓ ల ఆర్ అండ్ బి దృష్టికి తీసుకళ్ళారని సాక్షాత్తు మైనారిటీ శాఖా మంత్రి అంజాద్ బాషా చెప్పినా పట్టించుకోలేదన్నారు.

ఇటువంటి పరిస్థితిల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోని హజరత్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ , హజరత్ హుస్సేన్ షా ఖాద్రీ దర్గాలను అభివృద్ధి చేయాలని కోరారు.దర్గాల జోలికి వస్తే కుట్ర దారులకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.  అనంతరం సూఫీ హజరత్ నజిరుద్దీన్ బాబా మాట్లాడుతూ మత సమరస్యానికి నెలవైన విజయవాడ నగరంలో ఇటువంటి పరిస్థితి రావాడం బాధాకరమని మసీదు రక్షణకు కదలాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మసూద్ అలీ జిన్నా, భవానీపురం దర్గా ప్రెసిడెంట్ ముస్తాక్, దర్గా ముజావర్ సయ్యద్ అస్గర్ ముస్లిం పెద్దలు మతగురువులు పలువురు మత పెద్దలు కోబ్బరి కాయలు కొట్టి నిరసనను తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *