పాతబస్తీలో వరద బీభత్సం…కాలనీల్లో వరద నీరు ఉద్ధృతం

హైదరాబాద్‌: పాతబస్తీలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలక్‌నుమా బార్కాస్‌లో వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. తాడు సాయంతో అతన్ని కాపాడేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు అందించిన తాడును కొట్టుకుపోతున్న వ్యక్తి వరద తీవ్రతకు పట్టుకోలేకపోయాడు. దీంతో అందరూ చూస్తుండగానే వరద ప్రవాహంలో కొట్టుకెళ్లాడు. గల్లంతైన వ్యక్తికోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బార్కాస్‌లోని ప్రధాన రహదారులను నదులను తలపిస్తున్నాయి.

బండ్లగూడ మహమ్మదీయ హిల్స్‌లో వర్షాలకు గుట్టలపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు ఇళ్లపై పడ్డాయి. దీంతో రెండు ఇళ్లు నేలమట్టమై ఇంట్లో నింద్రిస్తున్న 8మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *