రెండు మూడేళ్ళ పాటు దాదాపుగా ఇదే పరిస్థితి… గల్ఫ్ నుంచి వచ్చేస్తున్నా ఎన్నారైలు…?

గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాల్లో నిరుద్యోగ సమస్య అనేది క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వాలు అక్కడి వారికి అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దాదాపు అన్ని దేశాలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా దెబ్బకు ఆయా దేశాల ఆర్ధిక రంగం అనేది చాలా దారుణంగా దెబ్బ తినే పరిస్థితి వచ్చింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆర్ధికంగా బలపడే విధంగా చర్యలు చేపట్టే క్రమంలో అక్కడి ప్రభుత్వాలు ఉద్యోగాల విషయం లో చాలా వరకు అక్కడి వారికే ఉపాధి కల్పించే పరిస్థితి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మన ఎన్నారైలు కూడా చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్లి స్థిరపడిన వారు కూడా చాలా వరకు నరకం చూస్తున్నారు. ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాలు, కేరళ సహా కొన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి చాలా మంది వెళ్ళారు. వారికి ఉద్యోగాలు పోయిన పరిస్థితి మనం చూసాం. ఇంకా రెండు మూడేళ్ళ పాటు దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అక్కడ ఉద్యోగాలు కోల్పోయి వ్యాపారాలు అయినా చేసుకుందాం అని చూస్తున్నారు.

అయితే కొంత మంది మాత్రం తిరిగి వచ్చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. భారత్ కి వచ్చేయడానికి ఎన్నారైలు సిద్దమవుతున్నారు. అక్కడి స్థానికుల కోసం కొన్ని ఉద్యోగ చట్టాలు కూడా చేసే అవకాశం ఉంది. దీనితో రోడ్డున పడటం కంటే ముందే ఇక్కడికి వచ్చేసి ఏదోక పని చేసుకుంటే మంచిది అనే భావన అక్కడి వారిలో వ్యక్తమవుతుంది. మరి భవిష్యత్తులో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటికే అమెరికా సహా కొన్ని దేశాల నుంచి ఎన్నారైలు వచ్చేసిన సంగతి తెలిసిందే.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *