కానిస్టేబుల్ పై ఇన్ స్ట్రక్టర్ అత్యాచారం…

పోలీసు కానిస్టేబుల్ గా శిక్షణ పొందుతున్నయువతిపై శిక్షణా కేంద్రంలోని చీఫ్ డ్రిల్ మాస్టర్ అత్యాచారం చేసిన ఘటన అస్సాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అస్సాలోని డేర్గాఁవ్ సాయుధ పోలీసు శిక్షణా కేంద్రంలో ఓ వివాహిత మహిళ.. ట్రైనీ కానిస్టేబుల్ గా శిక్షణ పొందుతున్నారు. శిక్షణా కేంద్రంలో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నసీనియర్ అధికారి ఒకరు ఆ మహిళపై అత్యాచారం చేశారు.

ఆమె శిక్షణ వదిలేసి ఇంటికి వెళ్లి తన భర్తకు ఈ విషయం చెప్పారు. వారిద్దరూ కలిసి డేర్గాఁవ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు అత్యాచారం చేసిన సీనియర్ అధికారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 9వతేదీన జరిగిందని.. కేసు విచారణ కొనసాగుతుందని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోలాఘట్ అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సుర్జీత్ సింగ్ పానేసార్ చెప్పారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *