వివేకమా అవివేకమా…..సాహెబ్‌! మీ గురించి ఆలోచించండి!

TDP Vs YCP in Kakinada Elections - Telugu Bullet

ఆంధ్ర రాష్ట్రంలో క‌మ్మ‌-రెడ్లు ఆధిప‌త్యం కోసం పోరాడుకుంటున్నారు. ఎవ‌రికి ద‌మ్ము వుంటే వాళ్ళే నిల‌బ‌డ‌తారు. హోరా హోరీగా జ‌రుగుతున్న ఈ పోరాటంతో ముస్లింలుగా మీకేంటి సంబంధం‌? రాజ‌ధాని అమ‌రావ‌తిలో వుంటే క‌మ్మ కులం వాళ్ళు సంప‌న్నులౌతారు. అదే విశాఖ‌ప‌ట్నంకు త‌ర‌లి వెళ్ళితే రెడ్డి కులం వాళ్ళు కోట్ల‌కు ప‌డ‌గెత్తుతారు. రాజ‌ధాని ఎక్కడ వున్నా నీవు సాయిబునే. విజ్ఞ‌త‌తో ఆలోచించండి. ఏసు ప్ర‌భువు చెప్పిన‌ట్లు… (నా కోసం ఏడ్వకండి మీ కోసం… మీ పిల్లల కోసం ఏడ్వండి.) తెలుగుదేశం పార్టీ కోస‌మో, వైసీపీ కోస‌మో మీరు బ‌ట్ట‌లు చించుకోన‌క్క‌ర‌లేదు. రోడ్ల మీద ధ‌ర్నాల‌కు దిగాల్సిన అవ‌స‌రం లేదు. అదేదో స‌మ‌యం ఉంటే ముస్లిం ప్ర‌యోజ‌నాల కోసం పోరాడండి.

May | 2019 | vedika

పార్ల‌మెంట్‌లోకి హిట్ల‌ర్ ఒక కోడిని తెచ్చి ఒక్కో ఈక‌ను పీక‌డం మొద‌టెట్టాడ‌ట‌. అదే ఇప్పుడు మోదీ… ముస్లింల‌కు వ్య‌తిరేకంగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌నుకోవ‌చ్చు. ఆ కోడి (అదే ముస్లిం) విల‌విల‌లాడింది. మొత్తం ఈక‌ల్ని పీకేశాక దానిని నేల మీద వ‌దిలి జేబులో నుండి ధాన్యం గింజ‌ల‌ను తీసి వేసాడ‌ట‌. ఆ కోడి అత‌ని బూటు కాళ్ళ ద‌గ్గ‌ర ప‌డిన ఆ గింజ‌‌ల‌ను చాలా ప్రేమ‌గా తిన్న‌ద‌ట‌. ఈక‌లు పీకేసిన సంగ‌తి మ‌ర‌చి పోయి.

అప్పుడు హిట్ల‌ర్ స్పీక‌ర్‌తో స‌భ్యుల‌తో ప్ర‌జ‌లు (ముస్లింలు) ఈ కోడి లాంటి వారు. ప్ర‌జాస్వామ్య దేశాల్లో పాల‌కులు చేసిన దోపిడీని కూడా మ‌ర‌చి పోతారు. ఎన్నిక‌ల ముందు తాయిలాలు చివ‌ర్లో వేసిన గింజ‌ల్లాంటివి. మీరు ఈక‌లు పీకిన సంగ‌తి ప్ర‌జ‌లు (ముస్లింలు) మ‌ర‌చిపోతారు అన్నాడు. అప్ప‌ట్లో హిట్ల‌ర్ ఆ దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి చెప్పిన‌ప్ప‌ట్టికీ ఇది ఖ‌చ్చితంగా ముస్లింల‌కు భార‌త్‌-(ఆంధ్ర‌, తెలంగాణాలోనూ)లో వ‌ర్తిస్తోంది.

అమరావతి.. ఆనందం ఆవిరైన వేళ

ఒక విష‌యం గుర్తు చేస్తాను. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన‌ప్పుడు తాడికొండ చుట్టుప‌క్క‌ల వున్న ముస్లింల‌కు సంబంధించిన పొలాలు ప్లాన్ ప్ర‌కారం రోడ్డు ప్ర‌క్క‌న వ‌చ్చాయి.   అయితే రోడ్డుకు దూరంగా క‌మ్మ‌వాళ్ల పొలాలు వున్నాయి. దీంతో ముస్లింలు భారీ ఎత్తున లాభ‌ప‌డే అవ‌కాశం వుంది. కానీ చంద్ర‌బాబునాయుడు నీచాతి నీచంగా ఆలోచించి రోడ్డు ప‌క్క‌న గ్రీన్ జోన్‌గా ప్లాన్‌లో ప్ర‌క‌టించి దూరంగా వున్న క‌మ్మ పొలాల్ని క‌మ‌ర్షియ‌ల్ జోన్‌గా ప్ర‌కటించాడు. దీంతో ముస్లింల పొలాలు రోడ్డు ప‌క్క‌న వున్నా… క‌నీసం కోటి రూపాయ‌ల రేటు ప‌ల‌క లేదు. ఎక్క‌డో దూరంగా వున్న క‌మ్మ పోలాలు 20 నుంచి 50 కోట్ల రూపాయ‌ల ధ‌ర అప్ప‌ట్లో వుండేది. (ఇప్పుడు ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోయాయి అదే వేరే విష‌యం) ఇది పాల‌కుల ప్రాధాన్య‌త‌. త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

ఇక్క‌డ నేనే చెప్పేది ఏమిటంటే ముస్లింల‌కు అన్యాయం చేయాల‌నేది చంద్ర‌బాబు ఉద్దేశం అయి వుండ‌క‌పోవ‌చ్చు. త‌న క‌మ్మ కులానికి చెందిన వారికి లాభం చేకూర్చ‌డానికి గ్రీన్ జోన్‌, క‌మ‌ర్షియ‌ల్ జోన్ టెక్నిక్‌తో త‌న వారికి లాభం చేకూర్చుకున్నారు.

మ‌న‌కు ఏమాత్రం సిగ్గు, ల‌జ్జా వుంటే బాబు గారి ద‌గ్గ‌ర నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది. అదేమిటంటే మ‌న వారికి మ‌నం అండగా నిల‌బ‌డ‌దాం. క‌లిసి వుందాం. క‌మ్మ లేదా రెడ్డి బూటు కాళ్ళ వ‌ద్ద ప‌డేసిన గింజ‌ల‌కు ఆశ‌ప‌డ‌కుండా ప‌రువుగా ఆత్మ‌గౌర‌వం కాపాడుకుంటూ నిల‌బ‌డ‌దాం.

బాబ్రీ మసీదు కేసులో తీర్పు: 'న్యాయం భ్రమ', సీబీఐ దర్యాప్తుపైనా ప్రశ్నలు -  BBC News తెలుగు

బాబ్రీ మ‌సీదు విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌ని ఏడ్చే ముందు ఒక విష‌యం గుర్తుంచుకోండి. అదేమిటంటే బాబ్రీ మ‌సీదు కోసం న్యాయ‌పోరాటం చేయ‌డానికి ముస్లిం న్యాయ‌వాది లేడు. ఇంత క‌న్న సిగ్గు ప‌డాల్సి విష‌యం మ‌రేముంటుంది? ప‌్ర‌తి ఏడాది ఎంత మంది ముస్లిం న్యాయ‌వాదుల్ని ముస్లిం క‌మ్యూనిటీ త‌యారు చేసుకుంటోంది ఒక సారి ఆలోచించండి. రాజ‌ధాని ఎక్క‌డ వుండాల‌నేది మ‌న ప్రాధాన్య‌త కాదు. ఏ పార్టీ అధికారంలో వుండాల‌నేది మ‌న ప్రాధాన్య‌త కాదు. అది డిసైడ్ చేయ‌డానికి నీవు ఎవ‌రివి సాయిబు? నీకు అంత సీన్ లేదు. కాబ‌ట్టి నీ చేతిలో వుంది నీవు చేయ‌డానికి ప్ర‌య‌త్నించు. ఏడాదికి ఎంత మంది ఐఎఎస్‌, ఐపిఎస్ ప‌రీక్ష ఉత్తీర్ణులౌతున్నారు? ఇది నీ చేతిలో ప‌ని మీ పిల్ల‌ల్ని అలా తీర్చిదిద్ద‌లేరా? ఓ సారి ఆలోచించు…. లేక పోతే భ‌విష్య‌త్‌లో చినిగిపోతావు. నిన్ను చీల్చి చంఢాల‌డానికి చాలా మంది సిద్ధంగా వున్నారు. నిద్దుర లే…

వెయ్యి ఏళ్ళు భార‌త్ ను పాలించామ‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌డం కాదు… ప్ర‌స్తుతం నీ స్థితిపై దృష్టి పెట్టే రోజు రానే వ‌చ్చింది. క‌నీసం మ‌న పిల్ల‌ల్ని అయినా ప్ర‌యోజ‌కుల్ని చేద్దాం. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లుగా, డాక్ట‌ర్లుగా, ఉన్న‌తాధికారులుగా, మంచి వ్యాపార‌స్థులుగా స‌మాజంలో కీల‌క‌మైన పాత్ర పోషించ‌డం నీ చేతిలోనే వుంది. దాని గురించి ఆలోచించు. అంతే కానీ నీ చేతిలో లేని విష‌యాలు, నీకు సంబంధం లేని విష‌యాలు, మ‌న‌కు, మ‌న పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌ని ఉద్య‌మాలు మ‌న‌కెందుకు బ్ర‌ద‌ర్‌….

-డా. ఫ‌జ‌ల్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *