సీనియర్ జడ్జిపై ఆరోపణలు… తగిన విచారణ జరగాల్సిందేః సుప్రీం మాజీ న్యాయమూర్తి

రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తించే ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలతో కూడిన లేఖ రాసినప్పుడు.. దానిపై విచారణ జరగాలని, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గంగూలి పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన విచారణ జరగాల్సి ఉందని, గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీనిపై మౌనంగా ఉంటారని తాను భావించడం లేదన్నారు. అయితే సమస్య పరిష్కారం విషయంలో ఆయన నిర్ణయానికి దీనిని వదిలిపెట్టాలని అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ జడ్జిపై, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాని న్యాయమూర్తి అయ్యే అర్హత కలిగిన న్యాయమూర్తిపై తీవ్రాతితీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ లిఖితపూర్వకంగా లేఖ రాయడం భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ జరగలేదు. స్వయంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించే అత్యున్నత కార్యనిర్వాహక హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలను చేసినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోను. ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను.. అని మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఏకే గంగూలీ అభిప్రాయపడ్డారు.ఏ రకంగా చూసినప్పటికీ ఇది తీవ్రమైన ఆరోపణ. ఎలాంటి విచారణ ఉంటుందో, ఏ చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు.

ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉండలేరు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. ఆరోపణలపై తగిన రీతిలో దర్యాప్తు జరపాలి. విచారణ ఎలా జరగాలి ఎవరు జరపాలి అన్న అంశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాల్సి ఉంటుంది.

ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విస్మరించరని నా అభిప్రాయం.. అని మాజీ న్యాయమూర్తి చెప్పారు. ఈ దేశ పౌరుడిగా, మాజీ న్యాయమూర్తిగా నేను ఏం ఆశించగలనంటే.. చీఫ్‌ జస్టిస్‌ దీనిని పక్కన పెట్టేస్తారని అనుకోవడం లేదు.

సాధారణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా న్యాయమూర్తులు పని చేయాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థ సక్రమంగా నడిచేలా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆ మేరకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు.రాజ్యాంగబద్ధంగా వ్యవస్థ నడిచేందుకు ప్రధాన న్యాయమూర్తి తగిన చర్యలు తీసుకుంటారు. విచారణ ఎలా ఉండాలని గానీ, ఉంటుందని గానీ నేను ఇండికేట్‌ చేయదలుచుకోలేదు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి విచక్షణ అది.

ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలి. సిట్టింగ్‌ న్యాయమూర్తులపై ఇలాంటి ఫిర్యాదులు రావడం నా దృష్టిలో లేదు. అయితే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సిట్టింగ్‌ న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ జరిపింది. కానీ అది ఇలాంటి ఆరోపణ కాదు అని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ తెలిపారు.మీడియాపై న్యాయస్థానం గ్యాగ్‌ ఆర్డర్‌ జారీ చేయకూడదు.

ఆరోపణలపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. న్యాయస్థానం పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌. సిట్టింగ్‌ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణ ప్రజలకు తెలుసుకునే అవసరం ఉంది. న్యాయమూర్తులు ప్రజాస్వామ్యంలో సభ్యులు అని మాజీ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *