అనస్థీషియా – నొప్పి నుండి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించే ఒక అద్భుత ఇంద్రజాల కథ

మరణం-జీవించడం మధ్య సెకండ్ల వ్యవధే కీలకంగా మారుతుందో అక్కడే అనస్థీషియాలజిస్ట్‌ది  కీలక పాత్ర

శస్త్ర చికిత్సలో నొప్పి నుండి పారిపోవడమంటే గ్రీకు పురాణాలలో కనిపించే ఒక భూతం నుండి తప్పించుకోవడమే ఎందుకంటే శస్త్ర చికిత్స లో కత్తి మరియు నొప్పి అనేవి రెండూ విడదీయలేని రీతిలో రోగుల మెదడును తొలచివేసే రెండు విషయాలు అంటారు ప్రఖ్యాత ఫ్రెంచి సర్జన్ ఆల్ఫ్రెడ్-అర్మండ్-లూయిస్-మారీ వేలపు 1939 లో.

1839 నాటి వరకూ కూడా నొప్పి లేని శస్త్ర చికిత్స అంటే ఒక అందమైన ఊహ అని భావిస్తే, శస్త్ర చికిత్స రంగంలో అపుడే కాలూనుతున్న వైద్యులు తాము రోగి వంటిపై కత్తి పెట్టి కోస్తున్న సమయంలో రోగుల అరుపులు, ఏడుపులకు అలవాటై పోతారనే చెప్పవచ్చు.  అలాంటి పరిస్థితి నుండి రోగిని తప్పించి అతనిని స్పృహ కోల్పోయేలా చేయడానికి నాటి వైద్య నిపుణులు ఎన్నో రకాల విధానాలను అవలంభిస్తూ వచ్చారు.  కానీ నొప్పి ఎప్పటికీ నొప్పే కదా.

అప్పటి నుండి 16 అక్టోబర్ 1846 వరకూ నొప్పిని తగ్గించడం అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే అయితే విలియం టి మార్టన్ అనే వైద్యుడు మొదటి సారి ఈథర్ ను అనస్థీషియా గా ఉపయోగించి మొట్ట మొదటి నొప్పి లేని శస్త్ర చికిత్సకు మార్గం సుగుమం చేయడంతో పరిస్థితి మారిపోయింది.  ఈ ఆవిష్కణతో శస్త్ర చికిత్స వలన కలిగే ఎన్నో లాభాలను రోగులు ఎలాంటి నొప్పి లేకుండా అనుభవించడం ప్రారంభమైంది.

నొప్పి లేని శస్త్ర చికిత్స విధానం అందుబాటులోనికి రావడం

ఇలా 150 సంవత్సరముల క్రితం ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సేవలనందించే విధానాన్ని మార్చి వేయడం జరిగింది. అనస్థిషియా అనేది ఒక కీలకమైన రంగంగా ఎదుగుతూ రావడంతో పాటూ ఎందరో అనస్థీషియాలజిస్టులను ప్రపంచానికి అందించింది.  ఒక నాడు అసలు కాదని అనుకొన్న జనరల్ అనస్థీషియా ఇపుడు ఎంతో ఖచ్చితత్వంతో కేవలం సృహ కోల్పోయోలా చేయడంతో పాటూ కండరాలకు కొంత విశ్రాంతి ఇవ్వడం, నొప్పి నుండి విముక్తి అందజేయడంతో పాటూ గుండె పోటును లాంటి వాటిని నియంత్రణలో ఉంచడం కూడా చేయడం జరుగుతుంది.

గత శతాబ్ద కాలంగా అనస్థీషియా ఇవ్వడం పై ఎన్నో సంక్లిష్టమైన పరిశోధనలు జరిగాయి.  ఒక వ్యక్తిని ఫార్మకోలాజిక్ కోమా స్థితిలో ఉంచే జనరల్ అనిస్థీషియా ను అందజేయడమే లక్ష్యంగా సాగిన అనస్థీషియా వలన నొప్పికి రోగి స్పందించకుండా చూస్తూ అతనికి సర్జరీలో జరిగిందేమిటీ గుర్తు లేకుండా చేయడం జరిగింది.  ఈ దిశగానే 19 వ శతాబ్దపు తొలి నాళ్లలలో అమెరికాలోని బోస్టన్ లో ఈథర్, ఇంగ్లండులో క్లోరోఫాం ను ఉపయోగించి మనిషికి ఏం తెలియని స్థితికి చేర్చి తద్వారా సర్జరీ వలన కలిపే నొప్పికి స్పందించకుండా చూడడం ప్రారంభమైంది.  అనంతరం 19 శతాబ్దపు మధ్య కాలంలో కొకైన్ ను కనుగొన్న తర్వాత శరీరంలో ఒక భాగానికి అంటే లోకల్ అనస్థీషియా ఇచ్చేందుకు వీలుగా మందులు అందుబాటులోనికి వచ్చాయి.

ఇలా 9 వ శతాబ్దపు చివరి నాటికి ఎన్నో రకములైన మందులు అందుబాటులోనికి రావడంతో అనస్థీషియాను ఇతర వైద్యాలలోనూ, నాడీ వ్యవస్థపై ఉపయోగించడం ప్రారంభమైంది.  ఇక ఇరవై శతాబ్దం వచ్చే సరికి పూర్తి స్థాయిలో నరాలను, కండరాలను పూర్తిగా నిరోధిస్తూ రోగిని పూర్తిగా అచేతన స్థితిలోనికి తీసుకొని వెళ్లడంతో పాటూ అతనికి అవసరమైన గాలిని యంత్రం సహాయంతో అందించే స్థాయికి అనస్థీషియా చేరింది.  ఇలా అందుబాటులోనికి వచ్చిన సరికొత్త పరికరముల కారణంగా అత్యవసర సమయాలలో రోగి ఆరోగ్య స్థితిని సరైన రీతిలో నిర్వహించడం అనేది అనస్థీషియాలజిస్టుల పనిగా పలు దేశాలు పరిగణించడం ప్రారంభించాయి.

అనస్థీషియాలజిస్టు – సంపూర్ణ వైద్య సేవలు అందించే వాడు

అనస్థీషియాలజిస్టు అనే వారు అనస్థీషియా సేవలు అందించడంతో పాటూ, నొప్పి నియంత్రణ, అత్యవసర వైద్య సేవలు అందిస్తూ రోగి శరీరంపై పూర్తి స్థాయి అవగాహన కలిగి వైద్యాన్ని అందించే ఆరోగ్య నిపుణులని చెప్పవచ్చు.  రోగికి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు ముందుగానే రోగి శారీరక, మానసిక స్థితిగతులను పూర్తి స్థాయిలో అంచనా వేసి అతనికి అందించే మత్తు మందు సేవల ద్వారా శస్త్ర చికిత్సా కాలంలో రోగికి సురక్షితమైన, ప్రభావవంతంగా ఉండేలా పని చేస్తారు.  శస్త్ర చికిత్స జరిగే సమయాలలో రోగిని మత్తులో అంటే స్పృహలో లేని స్థితిలో రోగికి చెందిన అన్ని కీలక శారీరక అంశాలను అంటే గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన పనితీరును ఎప్పటికపుడు అంచనా వేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా శస్త్ర చికిత్స పూర్తయ్యేలా చూడడమే కాకుండా ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా రోగి సాధారణ స్థితికి వచ్చేలా అనస్థీషియాలజిస్టులు పని చేస్తారు.

ఇలా కేవలం పెద్ద పెద్ద శస్త్ర చికిత్సల సమయంలోనే కాకుండా చిన్న చిన్న శస్త్ర చికిత్సల సమయాలలో పూర్తి స్థాయి మత్తు మందు అవసరం లేని సందర్భాలతో పాటూ గర్భిణులు ప్రసవ వేదన పడే సందర్భాలలో ఏర్పడే నొప్పిని నియంత్రించడం లాంటి పనులలో కూడా అనస్థీషియాలజిస్టులు ఇపుడు కీలక పాత్ర పోషిస్తున్నారు.  దీంతో పాటూ ప్రమాదాల ద్వారా ఏర్పడే గాయాల కారణంగా లేదా దీర్ఘకాలిక రుగ్మతల వలన వచ్చే నొప్పులు అంటే మైగ్రేన్ లాంటి వాటి విషయాలలో కూడా నొప్పి ప్రభావాన్ని తగ్గంచడానికి ఇపుడు అనస్థీషియాలజిస్టులు ఎంతో సహాయపడుతున్నారు.

ఇలా నేటి తరం అనస్థీషియాలజిస్టుల పాత్ర ఆపరేషన్ థియేటర్లకే పరమితం కాకుండా విస్తృతమైందినే చెప్పవచ్చు. వారు నిర్వహించే కార్యాలను పరిశీలిస్తే….

  • హాస్పిటల్లో అత్యవసర సేవలు అందించే బృందంలో భాగంగా ఉండడం
  • అత్యవసర సమయాలలో వచ్చే పేషంట్లను సాధారణ స్థితికి వచ్చేలా చూడడం
  • ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ప్రాణాపాయ పరిస్థితులలో భాదపడే వారిని ఉంచే యూనిట్లను నిర్వహించడంతో పాటూ పాముల కాటుకు గురయి భాదపడే వారి నుండి కోమా స్థితికి చేరే రోగుల బాగోగులు చూడడం
  • క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రుగ్మతల కారణంగా వచ్చే నొప్పి నుండి ఉపశమనం కలిపించే ప్రత్యేక నొప్పి నివారణ కేంద్రాలను నిర్వహించడం
  • హాస్పిటల్స్ లో నిర్వహించే పలు ఇతర వైద్య విధానాలు అంటే ఎండోస్కోపీ, రేడియాలాజికల్ వైద్య సేవలు అందించే సమయాలలో అవసరమై మత్తు ను అందించడం

నొప్పి నియంత్రణ లో నిపుణులు

అనస్థీషియాలజిస్టులు నొప్పి నివారణలో ప్రత్యేక నైపుణ్యత కలిగి దీర్ఘకాలిక రుగ్మతల కారణంగా నొప్పితో భాదపడే వారికి చికిత్స అందిస్తున్నారు.  ఎలాంటి పరిస్థితులలో తగ్గని నొప్పులు అంటే మైగ్రేన్ ద్వారా వచ్చే తలనొప్పులు, వెన్నుముక లో నొప్పి లేదా ఫైబ్రోమాల్గియా లాంటి స్థితి కారణంగా ఏర్పడే నొప్పులు ఉన్న సందర్భాలలో నేటి వైద్యులు నొప్పి నివారణలో నైపుణ్యం సాధించిన అనస్థీషియాలజిస్టుల వద్దకు వైద్యం కోసం పంపిస్తారు.

అత్యసర వైద్య సేవలు, గాయపడిన మరియు ప్రమాదకర పరిస్థితుల నిర్వహణ

అనస్థీషియాలజిస్టులు అత్యసర వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు ఎందుకంటే వారు శిక్షణ పొందే కాలంలో మనుషుల శారీరక నిర్మాణం, కణాల స్థితిగతులు, ఫార్మకాలజీ తో పాటూ రోగిని సాధారణ స్థితికి తీసుకొని రావడం వంటి అంశాలపై అవగాహన కలిపించబడి ఉంటారు.  అలానే మరి కొందరు అనస్థీషియాలజిస్టులు అత్యసర వైద్య కేంద్రాలలో అంటే పెద్ద వారికి ఇటు చిన్న పిల్లలకు సేవలు అందించే హాస్పిటల్స్ లో ఇంటెన్సివిస్టులుగా కూడా శిక్షణ పొందుతారు. ప్రాణాపాయ స్థితిలో సేవలు అందించే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల భాద్యులుగా పూర్తిగా ఆరోగ్యం దెబ్బ తిన్న రోగులకు కూడా వైద్య సేవలు అందించేలా వీరు తయారై ఉంటారు.  యంత్రాల ద్వారా ఆరోగ్యాన్ని నియంత్రించే స్థితిలో ఉన్న రోగులు మరియు ఇతర రోగాలతో భాదపడుతున్న వారికి అవసరమైన చికిత్స, వ్యాధి నిర్థారణ సేవలను అందించడమే కాకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరే పలువురు రోగులకు వచ్చే అన్ఫెక్షన్లను నియంత్రిస్తూ అందుకు తగినట్లుగా ఇతర వైద్య, పారామెడికల్ సిబ్బందితో కలసి పని చేసే నాయకులని కూడా చెప్పవచ్చు.

ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది అనస్థీషియాలజిస్టుల పరిథిలోనికి వస్తున్న సరికొత్త విధానం.  ఒక పెద్ద ప్రమాదం సంభవించిన సందర్భాలలో అత్యవసర సేవలు అందించే బృందాలకు సాధారణంగా అనస్థీషియాలజిస్టులు నాయకులుగా వ్యవహరించడం చూడవచ్చు.  ఎందుకంటే వీరు అత్యవసర సేవలు అందించే ఇంటెన్సివిస్టులుగా శిక్షణ పొంది రోగులను సాధారణ స్థితిలోనికి తీసుకొని రావడంలో నైపుణ్యం సాధించి ఉంటారు కాబట్టి.

సెకండ్లలో పని చేయాల్సిన సందర్భాలలో

ఒక సీనియర్ అనస్థీషియాలజిస్టు చెప్పినట్లుగా నడుస్తున్న పడవకు ఒక సర్ఝన్ నాయకుడైతే మునిగిపోతున్న పడవకు అనస్థీషియాలజిస్టు నాయకుడుగా ఉంటాడని అంటే శస్త్ర చికిత్సలో ఏ మాత్రం చిన్న సమస్య తలెత్తినా, ఎక్కువ రక్త స్రావం జరిగినా లేదా రోగికి సంబంధించిన కీలక ఆరోగ్య అంశాలలో తేడాలు వచ్చినా వెనువెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్ది రోగిని సాధారణ స్థితికి తీసుకొనివచ్చేలా చూసే భాద్యత అనస్థీషియాలజిస్టు పై పడుతుంది కాబట్టే ఇలా పేర్కొనడం జరిగిందని చెప్పవచ్చు.

ఇలా రోగికి ప్రాణాపాయ స్థితి తలెత్తినపుడు సెకండ్లలలో స్పందించి జీవితాన్ని కాపాడే రీతిలో శిక్షణ పొందిన అత్యున్నత నైపుణ్యాన్ని సాధించిన వైద్య నిపుణులే అనస్థీషియాలజిస్టులు అని చెప్పవచ్చు.  అత్యవసర సేవలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ఆపరేషన్ థియేటర్లు ఎక్కడైతే రోగి మరణం మరియు జీవించడం మధ్య సెకండ్ల వ్యవధే కీలకంగా మారుతుందో అక్కడే అనస్థీషియాలజిస్టులు ఎంతో కీలక పాత్ర పోషిస్తూ రోగులను కాపాడడం గమనించాల్సిన అంశం.

This article is prepared by Dr.Uma Sreedevi, MD MHA FIPP, Head of Department, Anesthesiology, Aster Prime Hospital, Hyderabad

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *