కోవిడ్ – ఆహారంపై ప్రభావంః జంక్ ఫుడ్ తగ్గించి ఇంట్లోనే తయారు చేసే ఆహారాన్ని తినండి!

ప్రపంచ ఆహార దినం 2020 ఎదుగు, పోషించు, కలసి నిలబెట్టు. కోవిడ్ – ఆహారంపై ప్రభావం

ప్రపంచ ఆహార దినం 2020 తో పాటూ ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహారం మరియు వ్యవసాయ సంస్థ కు 75 వసంతములు పూర్తి చేసుకొంది. ఇదే సమయంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఎన్నో అంశాలతో యుద్దం చేయాల్సి రావడం జరుగుతోంది. అందుకే ఈ ప్రపంచ ఆహార దినం నాడు ఈ మహమ్మారి కారణంగా భాదపడుతున్న అత్యంత అట్టడుగు వర్గాల వారికి మద్దతు తెలుపుతూ మన ఆహార వ్యవస్థలను మరింత గట్టిపరుస్తూ తద్వారా అవి కోవిడ్ లాంటి మహమ్మారితో పాటూ వాతావరణంలో తలెత్తే మార్పులను తట్టుకుంటూ కూడా అవసరమైన వారందిరికీ మంచి ఆరోగ్య కరమైన పౌష్టికాహారాన్ని అందచేయడం జరగాలని కోరుకుంటున్నా. అదే సందర్భంలో అందరికీ అవసరమైన రీతిలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందజేస్తున్న ఆహార ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలలో పని చేస్తున్న పని వారందరికీ మంచి జీవనాన్ని అందించగలగడం కూడా చేయాలి.

ఆకలి, ఊబకాయం, నానాటికీ హీనదశకు చేరుతున్న పర్యావరణం, కోల్పోతున్న వ్యవసాయ జీవ వైవిధ్యం, ఆహారపు నష్టం, ఆహారాన్ని వృధా చేయడం తో పాటూ ఆహార ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలలో పని చేస్తున్న వారి జీవనానికి సరైన బరోసా లాంటి ఎన్నో సమస్యలు ఈ మొత్తం వ్యవస్థలను గాడి తప్పేలా చేస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి తో పోరాడి బయటకు రావడానికి సరికొత్త విధానాలను అవలంభిస్తున్న దేశాలకు ఇలా గాడి తప్పుతున్న వ్యవస్థను దారిలో పెట్టడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు ఎన్ని ఏర్పడినా తట్టుకొనేలా వ్యవస్థలను తయారు చేయవచ్చు.

తక్షణావసరం
ఒక పౌష్టికాహార నిపుణునిగా, ప్రపంచంలో ఆకలి మరియు పౌష్టికాహారాల లేమిని తగ్గించాలనే ఆశయాన్ని సాధించడానికి భూమి మీద నివస్తున్న ప్రతి మానవునికి పాత్ర ఉంటుంది. ఇలాంటి మహమ్మారి సమయాలలో మంచి అలవాట్లు, నియమాలు కట్టుదప్పకుండా నిలబెట్టేటట్టు చూడాల్న భాద్యత అందరిపై ఉంటుంది. మనం మంచి ఆహారపు అలవాట్లను ఎంపిక చేసుకోవచ్చు. అలానే ఆహారం వృదా కావడాన్ని అరికట్టడానికి మన వంతు కృషి చేయవచ్చు. ఆహారపు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను మరింత గట్టిపరచడానికి అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందిస్తూ అది అవసరమైన వారందరికీ దానిని అందిస్తూ ప్రభుత్వానికి చేయూత నివ్వవచ్చు. మనందరం కలసి పెరుగుతూ, పోషిస్తూ మన ప్రపంచాన్ని నిలబెట్టవచ్చు.

ముఖ్యంగా ఆహారాన్ని ఉత్పత్తి, తయారీ చేసే కంపెనీలు, వాటిని ప్రపంచానికి అందిస్తున్న ఈ కామర్స్ సంస్థలు అందరూ కలసి అతి త్వరగా పాడయ్యే ఆహార పదార్థములను నిల్వచేయడం, సరఫరా చేసే పరిజ్ఞానంపై కృషి చేసి అందరికీ అందేలా చూడాలి. కేవలం లాభాలపైనే దృష్టి కేంద్రీకరించకుండా సహజ వనరులపై ప్రభావం పడకుండా ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచించాలి.

ఎదుగు, పోషించు, కలసి నిలబెట్టు – మన తీసుకొనే చర్యలే మన భవిష్యత్తును సూచిస్తాయి
ఇటీవల కొన్ని దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణ, పట్టణీకరణ, ఆదాయం పెరుగడం వంటి పలు కారణాల కారణంగా మనం తినే ఆహార పదార్థములు, ఆహారపు అలవాట్లు ఎంతగానో మారి పోయాయి. కాలానుగుణంగా లభించే మొక్కల ఆధారిత ఆహారం మరియు పీచు పదార్థములతో కూడిన ఆహార పదార్థముల నుండి ఎక్కువగా శుద్ది చేయబడిన పిండి పదార్థములు, చక్కెర, కొవ్వు పదార్థణులు, శుద్ది చేయబడిన ఆహారం, మాంసంతో పాటూ మాంసాహార ఆదారిత ఆహార పదార్థముల వైపు మళ్లిపోయాం. అంతే గాకుండా పట్టణ ప్రాంతాలలో ప్రదానంగా మనం ఇంటిలో ఆహారం తయారు చేయడం మాని సూపర్ మార్కెట్ లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు, ఇంటికి సరఫరా చేసే రెస్టారెంట్స్ వంటి వాటిపై ఆధారపడడం ప్రారంభమైంది కూడా. ఇలా ఎటువంటి నాణ్యత, ఆరోగ్యపరమైన అంశాలు లేని ఆహారం తీసుకోవడంతో పాటూ సహజ నియమ నిబంధనలకు వ్యతిరేకమైన జీవన శైలి కారణంగా మనలో ఊబకాయంతో పాటూ పలు ఇతర సమస్యలు ఎక్కువైనాయి. ఇది ఏదో ఎక్కువ ధనవంతమైన దేశాలలోనే జరుగుతుందనుకొంటే పొరపాటూ బీద దేశాలలోనూ ఆకలితో పాటూ ఊబకాయం కలసి పెరగడం విశేషం.

ఐక్యరాజ్యసమితి వద్ద నున్న గణాంకాల ప్రకారం 5-19 సంవత్సరముల వయస్సు మధ్య ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు కలసి మొత్తంగా 120 మిలియన్ల సంఖ్యలో అధిక బరువుతో భాదపడుతుంటే ఇక 5 సంవత్సరముల లోపున్న 40 మిలియన్ల చిన్నారులు కూడా పెరిగిన బరువుతో ఇబ్బందికి గురవుతుంటే అదే సమయంలో 820 మిలియన్ల ప్రజలు ఆకలిలో అలమటిస్తున్నారు. అరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఊబకాయంతో పాటూ ఇతరత్రా ఏర్పడే పౌష్టికాహార లేమితో ప్రతి ముగ్గురులో ఒకరు భాదపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక మంచి వార్త ఏమిటంటే వీటికి అవసరమైన పరిష్కారాలు అత్యంత తక్కువ ఖర్చుతోనే లభించడం.

మరి మనం ఏం చేయాలి?
ప్రపంచ ఆరోగ్య దినం నాడు మన ఏర్పాటు చేసుకొన్న లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి….క్రింద పేర్కొన్న కొన్ని చర్యలను ప్రయత్నిస్తే మంచిది కదా….
• ఆహారాన్ని వృధా చేయకుండా చూస్తూ ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా చెత్తబుట్టలోకి వెళ్లకుండా వినియోగించాలి. ఎందుకంటే ఆకు పచ్చని ఆకు కూరలు, కూరగాయలలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండడమే కాకుండా అవి నేడు అత్యదిక శాతం ప్రజలకు అందబాటులో ఉండడం లేదు కాబట్టి.
• అవసరానికి మంచి వంటగదిని సరకులతో నింపివేయవద్దు. ఎందుకంటే ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, మసాలాలు, కాఫీ ల వంటి వాటిని ఎక్కువ నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. అవి చెడిపోయే కాలాన్ని బట్టి తగిన మోతాదులో అందుబాటులో ఉంచుకొంటే సరిపోతుంది.
• ఆకలి అయితేనే తినాలి తప్ప అనవసరంగా ఆహారాన్ని తీసుకోవడం వలన మన ఆరోగ్యంపై ప్రభావం పడి అది ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుంది.
• సమతుల్యమైన పౌష్టికాహారం మంచి జీవనాన్ని ఎంతో అవసరం. మనం తీసుకొనే ఆహారంలో ప్రోటీన్, పీచు పదార్థములు, ఓమెగా-3 కొవ్వు పదార్థములు, విటమిన్లు, మినరల్స్ అన్నీ సమపాళ్లలలో ఉండేలా చూసుకోవాలి. నిపుణుల సలహా లేకుండా అహార పదార్థములను మెనూలో నుండి తొలగించవద్దు.
• శుద్ది చేయబడిన ధాన్యాలు లేదా పదార్థములను వినియోగించడం తగ్గించాలి. శుద్ది చేయబడిన, సగం వండిన ఆహార పదార్థములను ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరగడంతో పాటూ గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
మన దైనిందన జీవనంలో చిన్న చిన్న మార్పులు తీసుకొని రావడం వలన మన పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతాం. దీంతో పాటూ ఎదుగుతున్న పిల్లలకు మంచి ఆహారంపై అవగాహన చిన్న వయస్సు నుంచే కలిపించడం కూడా అంతే అవసరం. తాజా కూరగాయలు, పండ్లు తినడాన్ని అలవాటు చేసి జంక్ ఫుడ్ తగ్గించి ఇంట్లోనే తయారు చేసే ఆహారాన్ని తినేలా చూడాలి.
ఇది చాలా సులభమైన పని, మనం తీసుకొనే చర్యలే మన భవిష్యత్తును నిర్థారిస్తాయి.
Article is prepared by
Dr A Kiraannmayee, Chief Clinical Dietitian, Apollo Cradle & Children’s Hospital, Jubilee Hills, Hyderabad

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *