ముస్లింల‌ది ఉనికిని నిలబెట్టుకునే భౌతిక సంఘర్షణ….

మోదీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దేశాన్ని హిందూ రాజ్ చేయ‌డానికి ఒక్కో అడుగు ముందుకు ప‌డుతోంది. అందులో భాగంగానే పౌరసత్వ సవరణ బిల్లు , ఆర్టికల్ 370 సవరణ, ఎన్‌ఆర్‌సీ, ఇప్పుడు తాజాగా హ‌లాల్‌పై నిషేధం విధించ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం.

బాబ్రీ మ‌సీదు వివాదంలో వ‌చ్చిన‌ట్లే…. త‌మ‌కు మ‌ళ్ళీ అనుకూలంగానే తీర్పు వ‌స్తుంద‌ని భావించి అంఖండ భారత్ మోర్చా సుప్రీంకోర్టులో ‘హలాల్’ విధానంలో జంతువధను నిషేధించాలంటూ పిటిషన్ వేసింది. ‌ దాఖలైన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రజలు తినే ఆహార పదార్థాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని కోర్టు స్పష్టం చేసింది. ‘‘ఒకరు శాకాహారిగా ఉండాలా లేక మాంసాహారిగా ఉండాలా అన్నది కోర్టులు నిర్ణయించలేవు. ఎవరికి హలాల్ మాంసం ఇష్టమైతే వారు హలాల్ మాంసం తినొచ్చు. ఝట్కా మాంసం కావాలనుకునేవారు ఝట్కా మాంసం తినొచ్చు..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక పిటిషనర్‌కు తీవ్ర దురుద్ధేశం ఉందంటూ ఈ సందర్భంగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు హ‌లాల్ విష‌యంలో ముస్లింల‌పై క‌నిక‌రించింది. ముస్లింలారా ఇక పండ‌గ చేసుకోండి. హ‌లాల్ తినండి. హ‌రాం జోలికి వెళ్ళ‌కండి.

ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే “సంఘర్షణ”. ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే “సంఘర్షణ ” తన కలలు పండించుకోవడానికి ఒక “కలామ్ ” పడ్డది “సంఘర్షణ ” మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!  భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది ముస్లింలున్నారు. ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న రెండో దేశంగా భారత్ ఉంది.

మోదీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దేశాన్ని హిందూ రాజ్ చేయ‌డానికి ఒక్కో అడుగు ముందుకు ప‌డుతోంది. అందులో భాగంగానే పౌరసత్వ సవరణ బిల్లు , ఆర్టికల్ 370 సవరణ, ఎన్‌ఆర్‌సీ, బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు హిందువుల పక్షాన తీర్పు ఇస్తూ వివాదిత భూమిని మందిరం కోసం ఇచ్చింది.

28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో బాబ్రీ మ‌సీదు కూల్చివేతను ప్లాన్ ప్ర‌కారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32మంది నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం దేశంలోని హిందువులు-ముస్లింల మధ్య పెరిగిన వైషమ్యం, కలహాలు, గుజరాత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా సాగిన మారణహోమం. ఇంతే కాదు… మ‌రెన్నో స‌వాళ్ళ‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా వుండాలి. గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి గుణ‌పాఠం నేర్చుకోండి.

మాలెగాం (మహారాష్ట్ర) బాంబు పేలుళ్ల (2006) కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, సీనియర్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రచారక్‌ సందీప్‌ డాంగే, రాంజీ కల్‌సంగ్ర బాంబు పేలుళ్లకు మూల కారకులుగా ఆధారాలు దొరికాయి. అజ్మీర్‌ షరీఫ్‌ దర్గావద్ద, హైదరాబాద్‌లో మక్కామసీదు వద్ద, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లకు హిందూ టెర్రరిస్టులే కారణమని ఆధారాలు దొరికాయి. ఈ టెర్రర్‌ నెట్‌వర్క్‌లో కీలకమైన వ్యక్తి స్వామి అశీమానంద్‌ను అరెస్టు చేయటంతో హిందూ టెర్రరిస్టుల కుట్ర, ఆర్‌.ఎస్‌.ఎస్‌.తో వారి సంబంధాలకు ఆధారాలు దొరికాయి. అశీమానంద్‌ నేరాంగీకార ప్రకటన వెలుగులోకి వచ్చాక బి.జె.పి. నోరు మెదపలేదు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకుడు సునీల్‌ జోషి, ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ తదితర హిందూ తీవ్రవాదులతో తాను నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. హిందువులు అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాకు వెళ్లకుండా నిరోధించేందుకు అక్కడ బాంబులు పేల్చారట!

దేశ విభజన సమయంలో నిజాం పాకిస్తాన్‌లో చేరాలని కోరుకున్నందుకు హైదరాబాద్‌లో మక్కామసీదు వద్ద బాంబు పేల్చారట!

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య తిరిగే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ప్రధానంగా పాకిస్తానీయులు ఉపయోగించుకుంటు న్నందున 2007లో అందులో బాంబు పేల్చారు. ఈ పేలుడులో 68 మంది చనిపోయారు.

మాలెగాం జనాభాలో 80శాతం ముస్లింలు కాబట్టి అక్కడ బాంబులు పేల్చామని అశీమానంద్‌ చెప్పారు.

అజ్మీర్‌ దర్గా వద్ద బాంబు పేలుళ్లకు ముఖ్యసూత్రధారి అయిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకుడు సునీల్‌ జోషిని 2007లో మధ్యప్రదేశ్‌లో ఎవరో తుపాకీతో కాల్చిచంపారు. టెర్రర్‌ చర్యను కప్పిపెట్టేందుకు ఆయన సొంతమనుషులే కాల్పులు జరిపారని రాజస్థాన్‌ పోలీసులు చెప్పారు.

ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న మ‌న జీవితాల్లో లేని పోని స‌మ‌స్య‌ల్ని సృష్టించి పాల‌కులు త‌మ రాజ‌కీయ క్రీడ ఆడుతున్నారు.  ప్ర‌స్తుతం ముస్లింల  జీవితం అంటే సంఘర్షణ… ప్రశ్నకు – సమాధానానికి మధ్య సంఘర్షణ, ప్రశాంతతకు – పరిశోధనకు మధ్య సంఘర్షణ, బతుకుకు – చావుకు మధ్య సంఘర్షణ ఇన్ని సంఘర్షణల మధ్య ఎన్నో ప్రశ్నలు మనసును కల్లోలం చేస్తూ ఉంటాయి.  ముస్లింలలో అభ‌ద్ర‌త‌భావం క‌ల్పించి వారికి తెలియ‌ని మ‌రేదేదో భ‌యం వెంటాడేలా చేయ‌డం వెనుక పెద్ద కుట్రే వుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, క‌మ్యూనిస్టులు త‌మ‌దైన స్టైల్‌లో ముస్లింల జీవితాల‌తో ఆడుకున్నారు. ఇప్పుడు వంతు బీజేపీది అయింది అంతే. ముస్లింల జీవితాల్లో పెద్ద తేడా లేద‌ని గ‌ణాంకాలు, సంఘ‌ట‌న‌లు, క‌మీష‌న్‌ల నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌న క‌ర్త‌వ్యం ఏమిటి?  పాల‌కుల్ని చూస్తుంటే ముళ్ళ పంది గుర్తుకు వ‌స్తోంది….. ముళ్ళపంది తన ముళ్ళను నిక్కబొడిస్తే, వాటినుండి మీరు దూరంగా ఉండాలి. ముళ్ళు ముడుచుకున్నప్పుడు మీరు దానితో వ్యవహరించవచ్చు. ముళ్ళని ఎప్పుడూ నిక్కబొడిచే శక్తి దానికి లేదు. స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డం అల‌వాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతో వుంది.  జీవితంలో సామాజిక సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదే క్రమంలో మౌలికమైన తన ఉనికిని నిలబెట్టుకునే భౌతిక సంఘర్షణ కూడా సమాంతరంగా జరుగుతూ ఉంటుంది. త‌ప్ప‌దు… ఇలా ఎందుకు జ‌రుగుతోంది…. అంతే… అలాగే జ‌రుగుతుంది.

– డా.ఫ‌జ‌ల్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌

 

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *