టీటీడీ ఆస్తుల విక్రయంపై నిషేధం!

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ రచ్చ చెలరేగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన టీటీడీ ట్రస్టు బోర్డులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో టీటీడీ ఆస్తులను విక్రయించకూడదని నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఛైర్మెన్ వై వీ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు.

” టిటిడి ఆస్తులను భవిష్యత్తులో అమ్మడం అనేది నిషేధించాము.. దీనిపైనే బోర్డ్ తీర్మానం చేసింది.. ఇటీవల భూముల వేలానికి సంబంధించి వివాదం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నాము.. టిటిడి ఆస్తుల పరిరక్షణకు టిటిడి బోర్డ్ సభ్యులు, స్వామీజీలతో కమిటీ వేశాము.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. సెంటిమెంట్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తాము.. ” అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

తిరుమల శ్రీవారి దర్శనాలను పున: ప్రారంభించేందుకు అదొక్కటే అడ్డు అని చెబుతున్నారు టీటీడీ బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. ఆ అడ్డు గనక తొలిగితే ఆ వెంటనే శ్రీవారి దర్శనాలను ప్రారంభిస్తామని టీటీడీ ట్రస్టు బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తొలుత పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనాలకు ఆనుమతిస్తామని ఆయనంటున్నారు.

” లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన వెంటనే భక్తులని దర్శనాలకి అనుమతిస్తాము.. భక్తులు ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా..అని ఆశగా ఎదురు చూస్తున్నారు.. మేము కూడా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాము.. అయితే లాక్‌డౌన్ నిబంధనలే శ్రీవారి దర్శనాలను పున:ప్రారంభించేందుకు అడ్డు.. ఇవాళ (గురువారం) తిరుమలలో దర్శనాల ఏర్పాట్లని నేనే స్వయంగా పరిశీలించాను.. కేంద్రం, రాష్ట్రం నుంచి అనుమతి రాగానే భక్తులని దర్శనాలకు అనుమతిస్తాము.. ” అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వ అనుమతించిన వెంటనే దర్శనం ప్రారంభం అవుతుంది. దర్సనం ఏర్పాట్లు ఇప్పటికే టిటిడి సిద్దం చేసింది. టిటిడి ఆస్తులు, కానీ భూములుకానీ భక్తుల కానుకలను ఇకపై అమ్మకాల జరపరాదని నిర్ణయం. గత ప్రభుత్వం హయాంలో టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర విచారణ. ఇకపై టిటిడి భూము లు ఎక్కడ ఎప్పుడు వేలం ద్వారా వేయకుండా నిర్ణయం.

అన్య క్రాంతమైతే తప్పనిసరి అయితే వాటిని పరిరక్షణ కోసం స్వామి జీలతో కమిటీ. తిరుమలలో పాత భవనాల ఆధునీకరణ కోసం జరిగిన కేటాయింపులలో టిటిడి పై కావాలనే దుష్ప్రప్రచారం చేసిన వారిపై విచారణకు ఆదేశిస్తూ, చర్యలకోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానం.

గత బోర్డ్ తీసుకొన్న నిర్ణయం పై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాము. పాలక మండలి పై ఆరోపణలు చేసిన వారిపై సమగ్ర దర్యాప్తు. పాత గెస్ట్ హౌస్ లు ఇవ్వాలన్నా ఇకపై పారదర్శక పాటిస్తాం. నామినేషన్ పై గెస్ట్ హౌస్లు కేటాయించడం లేదు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో చిన్న పిల్లలు ఆసుపత్రి ఏర్పాటుకు నిర్ణయం.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: JournalistEye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *