నిరాడంబరంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు!

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది తెలంగాణ సర్కారు. రాజధాని హైదరాబాద్ తోపాటు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సంబరంగా నిర్వహించింది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం (జూన్ 2) ఉదయం 8.30 గంటలకు గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

ఈ కార్యక్రమానికి కూడా పరిమిత సంఖ్యలోనే నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రగతి భవన్‌లో జెండా ఆవిష్కరించనున్నారు కేసీఆర్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేస్తారు.

మంగళవారం మధ్యాహ్నం రాజ్ భవన్‌లో గోశాలను ప్రారంభించి, మొక్కలు నాటననున్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఇక మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు జెండాలను ఆవిష్కరించనున్నారు.

దశాబ్దాల విధ్వంసం తర్వాత దేశప్రజలు గర్వపడేలా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశవిదేశాల్లోని తెలంగాణ బిడ్డలందరికీ జ‌ర్న‌లిస్ట్ ఐ అభినందనలు తెలుపుతోంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: JournalistEye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *