జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం ప్రారంభం!

హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై భిన్నవాదనల నేపథ్యంలో ఈ సమావేశం కీలకమయింది. 12 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేశారు. తుంగభద్రపై గుండ్రేవుల వద్ద జలాశయం నిర్మాణంకోసం 2019లో పాలనామోదం ఇచ్చినా ఇంకా అడుగు ముందుకు పడలేదు.

ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనకరమన్న కోణంలో ఏపీ ఆలోచిస్తోంది. దీనివల్ల తెలంగాణలో అయిదు గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయి. వేదవతి, ఆర్‌డీఎస్‌ కుడి కాలువ, తుంగభద్రపై ఎత్తిపోతల పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అజెండాగా గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కీలక సమావేశం ప్రారంభమైంది. బోర్డు ఛైర్మన్‌ పరమేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో.. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలీమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: JournalistEye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *