కుతుబ్‌షా హైద‌రాబాద్! ”కరోనాబాద్ గా మారిందా?!

Telangana extends lockdown till May 7

హైద‌రాబాద్ ల్యాండ్ మార్క్ చార్మినార్‌. ఇప్పుడు క‌రోనాబాద్ ల్యాండ్ మార్క్‌గా సి.ఎం.కేసీఆర్ ఎలాంటి నిర్మాణం చేస్తారోన‌ని హైద‌రాబాద్ కాదు కాదు… క‌రోనాబాద్ ప్ర‌జ‌లు వెట‌కారంగా చెప్పుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా మహమ్మారి కోరలు చాస్తుండటం నగర ప్రజలను భయభ్రాంతులకు గురిఅవుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Cleaner Charminar a visual treat - The Hindu

ప్ర‌భుత్వం చేతులు ఎత్తేయ‌డంతో ఇక క‌రోనాతో కలసి సహజీవనం చేయాల్సిందేన‌ని ప్ర‌జ‌లకు అర్థం అయిపోయింది. ఎవరికి వారే మానసికంగా స్వీయ నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలను నిత్యకృత్యం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తగ్గిందని భావించిన కేసుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపు స్థాయికి చేరుకుంది. వారం రోజుల క్రితం వరకూ నగరంలో పదుల సంఖ్యలో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు మూడు వందలకు తగ్గడం లేదు. గత వారం రోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో నమోదైన క‌రోనా కేసుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే…. ఈనెల 18న తొలి సారిగా తెలంగాణ రాష్ట్రంలో 352 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 302 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 27, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి.

Telangana unlockdown guidelines: Hotels, malls, places of worship ...

ఆ తరువాత నుంచి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత రెండు రోజుల పాటు క‌రోనా కేసుల ఉధృతి కొంత మేర తగ్గింది. ఆ తరువాతి రోజు మొత్తం 546 కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 459 కేసులు, రంగారెడ్డిలో 129, మేడ్చల్‌లో 79 కొత్త కేసులు నమోదు కావడం ప్ర‌జ‌ల‌ వెన్నులో వణుకు పుట్టించింది. తాజాగా గురువారం ఆ సంఖ్య920కి చేరింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ 737, రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 60 కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ అదే స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కొరోనా తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం కూడా ఇక ఈ వైరస్‌ నుంచి కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని స్పష్టం చేసింది.

Coronavirus in Hyderabad: Today's updates from your city ...

దీంతో నగర ప్రజలతో పాటు వ్యాపారులు కూడా కొరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా నగరంలోని అధిక జనసమ్మర్థ వ్యాపార, వాణిజ్య సముదాయాలు అధిక సంఖ్యలో ఉన్న పాత నగరంలోని బేగంబజార్‌, మలక్‌పేట, చార్మినార్‌తో పాటు సికింద్రాబాద్‌, జనరల్‌ బజార్‌, ప్యారడైజ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాదిగా ప్రజలు వస్తుంటారు. ఈ ప్రాంతాలలో ఎక్కడా ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదనీ, ఇక్కడికి వచ్చిన వారిలో పాజిటివ్‌ ఉన్న వారి ద్వారా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వైరస్‌ విస్తరిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో హోల్‌ సేల్‌, రిటైల్‌ కిరాణా దుకాణాలు అధికంగా ఉన్న బేగం బజార్‌ మార్కెట్‌ను ఈనెల 28 నుంచి జూలై 5 వరకూ వారం రోజుల పాటు స్వచ్చందంగా మూసివేయాలని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్‌ ప్రతినిధులు నిర్ణయించారు. అలాగే, వస్త్ర వ్యాపారానికి సంబంధించిన దుకాణాలు అధికంగా ఉన్న సికింద్రాబాద్‌, జనరల్‌ బజార్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల వ్యాపారులు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నారు. జీవనోపాధికి వ్యాపారం లేకున్నా ఎలాగోలా నెట్టుకురావొచ్చు కానీ, కరోనా మహమ్మారి బారిన పడితే అసలు ప్రాణానికి ఎసరు వస్తుందన్న భావనతో కొరోనా ప్రభావం తగ్గే వరకూ ఇంట్లోనే కూర్చోవాలన్న కృతనిశ్చయానికి వ్యాపారులు వచ్చారు. కరోనా చికిత్సలకు రోజుకు కనీసం రూ. 2 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి రావడం కూడా వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.

57 confirmed cases in Old City; Charminar Zone worst affected

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు ప్రతీ రోజూ 700 నుంచి 800 దాకా నమోదవుతుండటంతో రోగులకు వైద్య చికిత్సలు అందించడానికి దవాఖానలు కూడా సరిపోవడం లేదు. ప్రభుత్వం కరోనా పరీక్షలు, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి వైద్య చికిత్సలు అందించడానికి ప్రైవేటు ఆసుపత్రులను సైతం అనుమతించడంతో కార్పొరేట్‌ దవాఖానలు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దవాఖానల యాజమాన్యాలు బెడ్లను కేటాయించడానికి రిజర్వేషన్‌ పద్దతిని పాటిస్తుండటం దిగ్భ్రాంతి కలిగించే విషయం.

25 Covid-19 positive cases surface in a single apartment in old ...

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటాన్ని బట్టి చూస్తే ఇది సామూహిక వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రె దశకు చేరిందా అని వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దశకు చేరినప్పుడు మాత్రమే ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

15 more coronavirus positive cases surface in Telangana

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *