ప్రేమ పేరిట లొబ‌రుచుకొన్నాడు… వీడియో తీసి వేధింపులు

నాగోలు: బహదూర్‌పురాకు చెందిన దానబోయిన శుభం యాదవ్‌(20) మూడేళ్లక్రితం కోఠిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదివే సమయంలో ప్రేమ పేరిట సహ విద్యార్థిని వెంట పడ్డాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఆ బాలిక వ్యక్తిగత చిత్రాలు.. వీడియోలు తెప్పించుకున్నాడు. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించి కొంత సొమ్ము వసూలు చేశాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసి గొడవైంది. అయినా బుద్ధి మార్చుకోని శుభం యాదవ్‌ తిరిగి ఆమెను బెదిరించి పదో తరగతి చదువుతున్న ఆమె సోదరి వ్యక్తిగత చిత్రాలు సైతం పంపమని బెదిరించాడు. ఆ బాలిక తన సోదరి వీడియోలు అతనికి పంపడంతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఆమె సోదరికి సైతం ఆ వీడియోలు, స్క్రీన్‌ షాట్‌ ఫోటోలు పంపి వేధించసాగాడు. దీంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *