రేపు ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా వేణు, అప్పలరాజు ప్రమాణస్వీకారం..

ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరేందుకు రంగం సిద్దమైంది. ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపిక కావడంతో వారి స్ధానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు రేపు మంత్రులుగా పదవీ ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని రాజ్ భవన్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ లాంఛనంగా తన కేబినెట్ మంత్రులను గవర్నర్ కు పరిచయం చేసి అక్కడి నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళతారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Syed sami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *