వర్షాకాలంలో పౌష్టికాహారం…ఆరోగ్యవంతులుగా మలచుకోవడమే మేలైన మార్గం

ఒక వైపు కోవిడ్ మహమ్మారి మరో వైపు వేగవంతమైన వర్షాకాలం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఛాలెంజ్ లను విసురుతోంది.  ఈ నేపధ్యంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మనల్ని మనం ఆరోగ్యవంతులుగా మలచుకోవడమే మేలైన మార్గం.  ఈ దిశగా మన శరీరంలోని వ్యాధి నిరోదకతను పెంచుకోవడానికి, పటిష్టమైన శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి సరైన ఆహారాన్ని తీసుకొనే దిశగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.  తద్వారానే వర్షాకాలం తెచ్చే ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కోగలుగుతామని వారు పేర్కొంటున్నారు.

సాధారణంగా వర్షాకాలంలో మనిషి వ్యాధి నిరోదకత తక్కువగా ఉంటుందనేది తెలిసిన విషయమే.  ప్రత్యేకంగా కోవిడ్ మహమ్మారి ఉన్న నేపధ్యంలో వ్యాధి నిరోదకత తగ్గకుండా ఉండడానికి మనం తినే ఆహారం, తీసుకొనే ద్రవ పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.  వ్యాధి నిరోధకత తగ్గితే చాలు మన శరీరంలోనికి ఎన్నో వైరస్ లు, బాక్టీరియాలు ప్రవేశించి తద్వారా పలు నీటి ఆధారిత జబ్బులు, జ్వరాలు, ఇన్ఫెక్షన్లతో పాటూ కోవిడ్ కూడా వాటిల్లే ప్రమాదం ఎక్కువ అవుతుంది.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మన వ్యాధి నిరోధకత పెంచుకోవడానికి ఈ కాలంలో లభించే తాజా పండ్లు అందులోనూ ముఖ్యంగా విటమిన్ సి ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.  బొప్పాయి, అరటి, peaches, pears, రేగు వంటి పండ్లు తీసుకోవాలి.  దీంతో పాటూ కూరలలో వెల్లుల్లి వినియోగం ద్వారా వ్యాధినిరోధకత పెరుగుతుంది.  వీటితో పాటూ చేదు కూరలైన కాకరకాయ వంటివి, మెంతి కూర తో పాటూ పసుపు వినియోగించడం ద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సాధ్యమవుతుంది.

వీటితో పాటూ వర్షాకాలంలో పాల ద్వారా బాక్టీరియా కడుపులోనికి నేరుగా వెళ్లకుండా నిరోధించడానికి పెరుగు లేదా యోగర్ట్ వినియోగం చేయవచ్చు.  దీంతో పాటూ గ్రీన్ టీ లేదా జింజర్ టీ ని తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమం లో యాంటాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ నిరోధకతను పెంచుకోవచ్చు.

ఇక వర్షాకాలంలో మానవుడు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య శరీరంలో ఎక్కువ నీరు చేరడం.  దీనిని అరికట్టడానికి పుచ్చకాయ, కర్భూజ వంటి పళ్లతో పాటూ మజ్జిగ, లస్సీ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. అలానే పులుపు పదార్థాలైన చింతపండు, టమాటో లాంటి వాటి వినియోగం నియంత్రించాలి. దీంతో శరీరంలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా నిరోధించ వచ్చు.  వీటితో పాటూ ఉప్పు వినియోగం తగ్గిస్తే అది కూడా నీటి నిల్వను తగ్గించడంతో పాటూ ఎక్కువ బ్లడ్ ప్రజర్ రాకుండా చూసుకోవచ్చు.  ఇక చివరగా కాఫీ, టీ వంటి వాటి వినియోగం తగ్గించి అనవసరంగా మన శరీరంలో జరిగే డీ హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.

ఇక వర్షాకాలంలో మనం ఎదుర్కొనే మరో సమస్య నీటి కాలుష్యం.  పలు కారణాల చేత త్రాగు నీరు కలుషితమై పలు నీటి ఆధారిత వ్యాధులకు కారణమవుతుంది.  దీంతో పలు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు.  దీనిని అరికట్టడానికి నీటిని బాగా వేడి చేసి తాగాలి.  ఇలా వేడి చేసే సమయంలో అందులో అల్లం, తులసి, పసుపు, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, ఎలకులు వంటి వాటిని వేయడం వలన పలు రకములైన ఇన్ఫెక్షన్లతో పాటూ కోవిడ్ ను కూడా నిరోధించవచ్చు.  వీటితో పాటూ పలు రకములైన anti inflammatory ఆహార పదార్థములు తీసుకోవడం వలన మనిషిలో ఏర్పడే ఆక్సీకరణ క్షీణాన్ని నిరోధించడానికి వీలవుతుంది.

వర్షాకాలంలో ముఖ్యంగా పైబర్, ప్రోటీన్ లతో కూడిన ఆహార పదార్థములు, కూర గాయలు, చికెన్, పిఫ్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.  ముల్లంగి రసాన్ని తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు తగ్గుతుంది.  దీంతో పాటూ వర్షాకాలంలో  రోడ్డు పై దొరికే ఆహార పదార్థములు, వేయించిన ఆహార పదార్థములులతో పాటూ కట్ చేసి నిల్వ ఉంచిన పండ్లు, జ్యూసులు మానివేయాలి.  ఎందుకంటే వీటి నాణ్యత, పరిశుభ్రత పై అనుమానాలు ఉండే అవకాశముంది కాబట్టి.

ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధులు వచ్చి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి పైన పేర్కొన్న రీతిలో ఆహారాన్ని తీసుకొని తద్వారా శారీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, కడుపులో వచ్చే వ్యాధులు, జ్వరాలు, థైరాయిడ్ సమస్యల వంటి వాటిని నిరోధించవచ్చు.

ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు – డా. ఎ కిరణ్మయి, ఛీఫ్ క్లినికల్ డైటీషియన్, అపోలో క్రెడిల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *