కోవిడ్‌–19 రోగుల కోసం అనుబంధ చికిత్సగా జింగివిర్‌–హెచ్‌ తుది క్లీనికల్‌ ట్రయల్స్‌ ముగిసినట్లు వెల్లడించిన పంకజ్‌కస్తూరి

• అధ్యయనం పూర్తి కావడంతో పాటుగా ఫలితాలను అవసరమైన అనుమతుల కోసం ఆయుష్‌కు సమర్పించడం జరిగింది
• సరాసరిన ఐదు రోజులలో రోగులు నెగిటివ్‌ ఆర్‌టీ పీసీఆర్‌ నివేదికను పొందుతున్నారు
హైదరాబాద్‌, 07 ఆగస్టు 2020 ః భారతదేశంలో కోవిడ్‌–19 విజృంభణ శరవేగంగా జరుగుతున్న వేళ పంకజ్‌కస్తూరి హెర్బల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీకెహెచ్‌ఐఎల్‌) నేడు నోవెల్‌ కరోనా వైరస్‌ రోగులలో తమ చికిత్స, విధాన పరంగా మెరుగైన ఫలితాలను సాధించినట్లుగా అధ్యయనం వెల్లడిస్తుందని తెలిపింది.
ఈ కంపెనీ తమ ట్యాబ్లెట్‌ జింగివిర్‌–హెచ్‌ కోసం నిర్వహించిన క్లీనికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా ముగిసినట్లు వెల్లడించింది. ఈ మహమ్మారి కోసం ఇది అనుబంధ చికిత్సగా ఉపయోగపడుతుంది. ఈ క్లీనికల్‌ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా పలు వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్న 116 మంది కోవిడ్‌–19 రోగులపై నిర్వహించారు. వీరిలో 58 మందికి జింగివిర్‌–హెచ్‌ మాత్రలు ఇవ్వగా, మిగిలిన వారికి ప్లాసెబో అందించారు. ఈ అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం హెర్బో–మినరల్‌ డ్రగ్‌ జింగివిర్‌–హెచ్‌తో చికిత్స పొందిన 58 మంది రోగులు 8 రోజులలో కోలుకోవడంతో పాటుగా సరాసరిన 5 రోజులలోనే ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌ నివేదిక పొందారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకనుగుణంగా ఈ క్లీనికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడంతో పాటుగా తుది ఫలితాలను కేంద్ర ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ మరియు హోమియోపతి మంత్రిత్వశాఖకు సమర్పించడం జరిగింది.
ఈ క్లీనికల్‌ ట్రయల్స్‌ గురించి పద్మశ్రీ డాక్టర్‌ జె హరీంద్రన్‌ నాయర్‌, ఫౌండర్‌ అండ్‌ ఎండీ – పీకెహెచ్‌ఐఎల్‌ మరియు పంకజ్‌కస్తూరి హెర్బల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ మాట్లాడుతూ ‘‘మా ఔషదం జింగివిర్‌–హెచ్‌ను విజయవంతంగా కోవిడ్‌–19 రోగులు కోలుకునేందుకు వినియోగించామని వెల్లడించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. క్లీనికల్‌ ట్రయల్స్‌తో పాటుగా సంబంధిత అధ్యయనాలలో మాకు మా బృందం ఎంతగానో సహాయపడింది. కోవిడ్‌–19 కోసం ఇది మొట్టమొదటి హెర్బో–మినరల్‌ మరియు ఆయుర్వేద ఔషదాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అని అన్నారు.
ఈ క్లీనికల్‌ అధ్యయనాన్ని కెఆర్‌ హాస్పిటల్‌ , మైసూరు ; ఆర్‌సీఎస్‌ఎం మెడికల్‌ కాలేజీ అండ్‌ సీపీఆర్‌ హాస్పిటల్‌, కొల్హాపూర్‌ ; సవీతా మెడక్‌కాలేజీ అండ్‌ హాస్పిటల్‌, చెన్నై, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌, ఫరీదాబాద్‌లలో చేశారు.
‘‘ఏడు పదార్థాలతో తయారుచేసిన ఈ ఔషద సామర్థ్యంను మేము పరిశీలించాము. కోవిడ్‌–19తో జరుగుతున్న పోరాటంలో ఆయుర్వేద ఆధారిత ఔషదాలు కీలక పాత్ర పోషించగలవన్న మా నమ్మకాన్ని ఈ అధ్యయనాలు మరింత బలోపేతం చేశాయి. త్వరలోనే స్టాండలోన్‌ చికిత్సగా 135 మంది రోగులపై జరుపుతున్న అధ్యయన ఫలితాలను సైతం విడుదల చేయనున్నాం’’ అనిడాక్టర్‌ నాయర్‌ వెల్లడించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *