ఏపీలో మూడు రాజ‌ధానులు.. తెలంగాణాకు కలిసి వస్తుందా..?

ఏపీలో గత యేడాదిన్నర కాలంగా జరుగుతోన్న ప్రతి అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా ముందుకు వెళుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తుందా? దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోంది. అయితే చెన్నై, బెంగళూరులో అనేకానేక సమస్యలు పెరిగిపోవడంతో ఇప్పుడు వీరి దృష్టంతా హైదరాబాద్ వైపే ఉంది. ఇదే అదనుగా కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సైతం అనేక రాయితీలు ఇవ్వడం ద్వారా కరీంనగర్‌, వరంగల్ లాంటి నగరాల్లో కూడా ద్వితీయ శ్రేణి కంపెనీలతో భారీ పెట్టుబడులు పెట్టేలా చకచకా పావులు కదుపుతున్నారు.

గతంలో ఏపీకి మూడు రాజధానుల ప్రకటన వెలువడిన వెంటనే ఏపీకి రావాల్సిన కొన్ని పరిశ్రమలు తెలంగాణకు తరలి వెళ్లడంతో టీ మంత్రి హరీష్‌రావు సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిణామాలు తెలంగాణ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ఉన్నాయని చెప్పారు. ఏపీలో మూడు రాజధానుల బిల్లు ఓకే కావడంతో కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిలో పెట్టుబడులు ఏపీకి వెళ్లే అవకాశం లేదని అంటున్నారట. మూడు రాజధానుల ముచ్చటతో పెట్టుబడి దారులు ఎక్కడ పెట్టుబడులు పెడతారు? ఏపీ ప్రభుత్వం వారిని ఎక్కడికి ఆహ్వానిస్తుంది? ఎలాంటి అవకాశాలు ఇస్తుందో చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, ఇది తమకు కలిసి వచ్చే అవకాశమని ఆయన అంటున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇదే విషయంపై ఇతర రాజకీయ పక్షాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

రాజకీయంగా ఇప్పట్లో రాజధానిపై రగడ తేలే పరిస్థితి కనిపించడం లేదని, సో.. పెట్టుబడులు అన్నీ కూడా ఏపీకి నిలిచిపోయే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా కరీంనగర్, వరంగల్‌ జిల్లాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంతోపాటు పెట్టుబడి దారులకు సుగమం అయ్యేలా కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే.. ఇక, తమకు తిరుగు ఉండదని కూడా తెలంగాణ రాజకీయ వర్గాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయని తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే దేశ, విదేశాల పెట్టుబడుదారులను గ్రేటర్ హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాలకు ఆహ్వానించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *