స్వాతంత్ర సంగ్రామంలో ఆంధ్రా ప్యారిస్ తెనాలి…

ఆగష్ట్ 12, 1942 భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంధ్రా ప్యారిస్ “తెనాలి” పేరును చారిత్రాత్మకం చేసిన తేది…..

ఆగష్టు 12, 1942 వ సంవత్సరంలో గాంధీజీ పిలుపునందుకొని తెనాలి లో ప్రజలు భారీ ఊరేగిఁపు నిర్వహించారు… క్విట్ ఇండియా అంటూ బ్రిటీష్ వారిని ఉద్దేశించి నినదిస్తూ సాగిన ప్రదర్శన స్థానిక రైల్వే స్టేషన్ కు చేరుకుంది….ప్రజల ఆవేదన ఆగ్రహంగా రూపాంతరం చెంది రైల్వే స్టేషన్, ఒక రైలు తగులబడ్డాయి…వెంటనే పరిసర ప్రాంతాల నుండి తెనాలి చేరిన బ్రిటిష్ బలగాలు ఉద్యమకారుల ఫై లాఠీలు ఝళిపించాయి… అయినా వెనకడుగు వేయక నినాదాలు చేస్తున్న ప్రజలపై చివరకు కాల్పులు జరిపారు…

ప్రస్తుత పాత బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ విషాధ ఘటనలో ఏడుగురు దేశ భక్తులు అమరులయ్యారు…

వారు 1. శ్రీ మాజేటి సుబ్బారావు 2. శ్రీ గిరి లింగం 3. శ్రీ భాస్కరుని లక్ష్మీ నారాయణ
4. శ్రీ తమ్మినేని సుబ్బారెడ్డి 5. శ్రీ గాలి రామకోటయ్య
6. శ్రీ ప్రయాఘ రాఘవయ్య 7.శ్రీ జాష్ఠి ఆప్పయ్య గార్లు……

ఈ సంఘటన యావత్ భారతావని దృష్టిని ఆకర్షించింది.. విదేశాలలోనూ భారత్ లో జరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమం గురించి చర్చకు దారి తీసింది…

అనంతర కాలంలో 1959లో అప్పటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఆలపాటి వెంకట్రామయ్య ఈ ఘటన జరిగిన ప్రాంతంలోనే అమరవీరులకు స్మారకంగా 7 స్థూపాలు, భరత మాత ఒడిలో ఒరిగిన బిడ్డ విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, ఈ ప్రాంతాన్ని “రణరంగ చౌక్” గా నామకరణం చేసారు… నాటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కామరాజు నాడార్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గార్ల చే రణరంగ చౌక్ ప్రారంభించబడింది….. జోహార్ అమరవీరులారా……జై హింద్… జై భారత్

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *