బెంగళూరులో అసలు ఏం జరిగింది? రెండు పోలీస్ స్టేషన్ పరిథుల్లో కర్ఫ్యూ…

రెండు పోలీస్ స్టేషన్ పరిథుల్లోనూ కర్ఫ్యూ కొన‌సాగుతోంది. బెంగళూరు నగరంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులోకి తెచ్చామని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు. పోలీసులు కాల్పులు జరపటంతో ముగ్గురు చనిపోయారని సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమల్‌పంత్ తెలిపారు. పోలీసులు 110 మందిని అరెస్ట్ చేశారు.

బెంగళూరులో హింస: పోలీసు కాల్పుల్లో ...

అస‌లేం జరిగింది?

పులికేసినగర్ ఎంఎల్ఏ అఖండ శ్రీనివాసమూర్తి (కాంగ్రెస్) బంధువు ఒకరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు మతవిశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ కొంతమంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ వ్యాఖ్య మీద ఫిర్యాదు చేయటానికి కొంత మంది ముస్లింలు పోలీస్ స్టేషన్‌ దగ్గరికి, మరో కొంత మంది ముస్లింలు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి ప్రదర్శనగా బయలుదేరారు. తమ ఫిర్యాదును నమోదు చేసుకుని.. తమ మత విశ్వాసాలను దెబ్బతీసినందుకు ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని ఒక వర్గం పట్టుపట్టింది.

మరోవైపు ఎమ్మెల్యే ఇంటి దగర్గ ఉన్న ముస్లింల స‌మూహం.. అక్కడ వాహనాలను దగ్ధం చేసింది. దీంతో కాల్పులు జరిపిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. “పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. అర్థరాత్రి 12.30 గంటల తరువాత దాడులు సర్దుమణిగాయి” అని కమిషనర్ ఆఫ్ పోలీస్ కమల్‌పంత్ బుధవారం ఉదయం మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్య చేసిన వ్యక్తిని తాము అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. నిందితుడు నవీన్ ఎమ్మెల్యేకు బంధువని వివరించారు.

Image

“నమస్కారం. నేను పులికేశినగర్ ఎంఎల్ఏ అఖండ శ్రీనివాసమూర్తి. ముస్లిం సోదరులందరికీ విజ్ఞ‌ప్తి…. చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ముస్లింల త‌ర‌ఫున మీరంతా గొడవకు దిగ‌వ‌ద్దు. మనమందరం సహోదరులం. తప్పు చేసినవారిని చట్టపరంగా శిక్షి ప‌డుతుంది” అంటూ ఎంఎల్ఏ ఒక వీడియో విడుద‌ల చేశారు.

“విషయం ఎలాంటిదైనా సరే చట్ట ప్రకారం విచారణ జరగాలి. చ‌ట్టాన్ని చేతిలోకి తీసుకొని హింస, తగలబెట్టడం చట్టవిరుద్ధమైన చర్యలు. పరిస్థితిని అదుపులోకి తీసుకోమని నేను పోలీసులకి చెప్పాను. ఈ సంఘటనకు బాధ్యులు ఎవరైనా సరే, వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ రెండు ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాం. దీనికి కారణమైనవారెవరైనా సరే చట్ట ప్రకారం శిక్ష పొందేలా చేస్తాం” అని రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఒక వీడియోలో తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *