పీడిత ప్రజల పక్షపాతి లింగన్న…టీయూడబ్ల్యుజె నేత విరాహత్ అలీ

పీడిత, తాడిత ప్రజల పక్షపాతిగా నిలబడి, తుది శ్వాస వదిలేంతవరకు సమసమాజ నిర్మాణం కోసం పరితపించిన గొప్ప వ్యక్తిత్వం లింగన్నదని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు.   మంగళవారం నాడు మండల కేంద్రమైన రాయపోలులో జరిగిన రామలింగారెడ్డి సంతాప సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.


లింగన్న ఆకస్మిక మృతి లక్షలాది పేద ప్రజలకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ ప్రజాప్రతినిధిని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, ఉన్నత లక్ష్యం కలిగి ఉన్న మహోన్నత వ్యక్తిని, ప్రజాస్వామిక వాదిని తెలంగాణ సమాజం కోల్పోవడం దురదృష్ట కరమన్నారు. లింగన్న ఓ వ్యక్తి కాదని, అద్భుతాలు సృష్టించే శక్తి అని ఆయన కొనియాడారు. లింగన్నతో 33ఏండ్ల అనుబంధం, ఆత్మీయత కలిగివున్న తాను ఆయనలో ఎన్నో ప్రత్యేకతలను గమనించనన్నారు. ప్రజా ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, సాహితీ ప్రియుడిగా, ప్రజాప్రతినిధిగా వివిధ రూపాల్లో ఎల్లవేళలా సమాజం, పేద ప్రజల హితాన్ని ఆకాంక్షించిన ప్రజల మనిషి లింగన్న అని విరాహత్ స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజె రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.కృపాకర్ రెడ్డితో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

* కుటుంబ సభ్యుల పరామర్శ*
దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను విరాహత్ అలీ పరామర్శించి, భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి లను ఓదార్చారు. ఆ కుటుంబానికి తాము వెన్నంటి ఉండి ఆయన లక్ష్య సాధనకుపాటు పడతా మన్నారు. 16న, జరిగే దశదిన కర్మ కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *