దేశంలోనే మొట్ట మొదటి పాథాలజీ ల్యాబొరేటరీ గా అపోలో నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ABPM-JAY)
క్రింద కోవిడ్ ఆర్ టి పీసీర్ టెస్టులను నిర్వహించడానికి
ఎంపానెల్ అయిన దేశంలోనే మొట్ట మొదటి పాథాలజీ ల్యాబొరేటరీ గా
గుర్తింపు సాధించిన అపోలో గ్రూపులో అంతర్భాగమైన
అపోలో డయాగ్నస్టిక్స్ వారి నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ

అపోలో హెల్త్ మరియు లైఫ్ స్టైల్ లిమిటెడ్ యొక్క డయాగ్నస్టిక్స్ విభాగమైన అపోలో డయాగ్నస్టిక్స్ వారి నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ కి కోవిడ్ టెస్టులను నిర్వహించడానికి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ABPM-JAY) వారి ఎంపానెల్మెంట్ లభించింది. ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి పాథాలజీ ల్యాబొరేటరీ అపోలో డయాగ్నస్టిక్స్ వారి నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకం క్రింద దేశ వ్యాప్తంగా ఉన్న లబ్ది దారులు ఈ పథకం క్రింద నాణ్యత కలిగిన అపోలో డయాగ్నస్టిక్స్ వారి కోవిడ్ పరీక్షా సేవలను వినియోగించుకోవచ్చు.

దీనికి సంబంధించిన ఒప్పందం పత్రాలపై నేడు డా.జీతు లాల్ మీనా, జనరల్ మేనేజర్, నేషనల్ హెల్త్ అథారిటీ మరియు శ్రీ చంద్రశేఖర్, గ్రూప్ CEO, అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ వారు సంతకం చేశారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ABPM-JAY) క్రింద గుర్తింపు పొందిన స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ల నుండి నమూనాలను సేకరించి అపోలో డయాగ్నస్టిక్స్ కు చెందిన నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ వారి వద్దకు పంపి పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ క్రింద పేర్కొన్న కేటగరీలకు చెందిన పేషెంట్లు ఈ సేవలను వినియోగించుకోవడానికి అర్హులు….

1. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ABPM-JAY) క్రింద గుర్తింపు పొందిన స్థానిక హాస్పిటల్ లో ఇన్ పేషెంట్లు గా చికిత్స పొందుతున్న ABPM-JAY పేషెంట్లు
2. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ABPM-JAY) క్రింద గుర్తింపు పొందిన స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందదలచి పరీక్షకు నమూనాలు ఇచ్చిన ABPM-JAY పేషెంట్లు
3. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ABPM-JAY) క్రింద గుర్తింపు పొందిన స్థానిక హాస్పిటల్ లోని వైద్యుల ద్వారా పరీక్ష నిర్వహించుకొని రమ్మని సూచించిన ABPM-JAY పేషెంట్లు. వీరు నేరుగా అపోలో డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ కి వచ్చి నేరుగా పరీక్ష చేయించుకోవచ్చు.

దీని వలన ABPM-JAY క్రింద లబ్దిదారులైన పేషెంట్లందరూ సింపిల్ రిజిస్ట్రేషన్ ద్వారా డబ్బులు చెల్లించనవరసం లేకుండా, స్థానికంగానూ లేదా అపోలో డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ వద్దకు వచ్చి కానీ పరీక్ష చేయించుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ABPM-JAY) కు చెందిన పోర్టల్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించబడుతుంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *