అమరావతికి నష్టం చేసిందెవరు? తాడికొండ, మంగళగిరి ఎన్నిక‌ల ఫ‌లితాలే అద్దం ప‌డుతున్నాయా?

అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తునే ఐదేళ్ళు గడిపేశాడు. రాజధాని నిర్మాణం పేరుతో తాను ఓ 20 దేశాలు తిరగటమే కాకుండా తనకు మద్దతుగా ఉండే ఉన్నతాధికారులను కూడా మరికొన్ని దేశాల్లో తిప్పాడు. అంటే అంతా కలిసి వందల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని వృధా చేశారు. ఇంతా చేసి చంద్రబాబు చేసిందేమిటంటే మూడు తాత్కాలిక నాసిరకం భవనాలను కట్టాడు. అందులో కూడా భారీ అవినీతే జరిగిందనే ఆరోపణలున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు తెరవెనుక ఒప్పందాలు చేసుకుని అమరావతిని రాజధానిగా ఏకపక్షంగా ప్రకటించేశారు. తానంతట తానుగా నిర్ణయించేసి అదే విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించేశాడు చంద్రబాబు. దాదాపు 29 వేలమంది రైతుల నుండి సుమారు 35 వేల ఎకరాలను సేకరించాడు. సేకరించినా నిర్మాణాలైనా సక్రమంగా చేశాడా అంటే అదీ లేదు. ప్రపంచ ప్రఖ్యాతిచెందిన రాజధాని అన్నాడు. సింగపూర్ కన్సార్షియం అన్నాడు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జీలన్నాడు.

అడుగడుగునా అవినీతికి లాకులెత్తిన చంద్రబాబు శుంకుస్ధాపనల పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేశాడు. ముఖ్యమంత్రిగా కూర్చున్న చంద్రబాబు పిచ్చోడి చేతిలో రాయిలాగ తయారైంది అధికారం. విలువైన కాలాన్నంతా తనిష్టం వచ్చినట్లు గడిపేసి వేల కోట్ల రూపాయలను వృధా చేసిన చంద్రబాబు చివరకు తాను చెప్పినట్లుగా ఒక్క భవనం కూడా కట్టలేక చతికిలపడిపోయాడు. అంటే అమరావతి పేరుతో జనాలను భ్రమల్లో ముంచేసి మోసం చేసిన విషయం బయటపడిపోయింది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన టిడిపి చివరకు రాజధాని నియోజకవర్గాలైన తాడికొండ, మంగళగిరిలో కూడా ఓడిపోయింది. మంగళగిరిలో పోటి చేసిన కొడుకు నారా లోకేషే ఓడిపోయాడంటే జనాలు చంద్రబాబుపై ఎంతగా మండిపోయారో అర్ధమైపోయింది.

అబద్ధాలు చెప్పి, మాయచేసి రైతుల నుండి తీసుకున్న భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డ చంద్రబాబే రైతులను మోసం చేశాడు. రైతుల భూములను సేకరించిన చంద్రబాబు వందల ఎకరాలను తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేశాడు. అంటే రైతులను మోసం చేసింది చంద్రబాబే. ప్రభుత్వ భూముల్లోనే సచివాలయం, అసెంబ్లీ, రాజభవన్, హైకోర్టుకు శాశ్వత భవనాలను నిర్మించేసుంటే సరిపోయేది. ఈ నిర్మాణాలకు అదనంగా మరో ఐదు వేల ఎకరాలను భవిష్యత్ అవసరాలకు అట్టేపెట్టుకునుంటే సరిపోయేది. ఇలా చేసుంటే ప్రైవేటు భూములను సేకరిచాల్సిన అవసరం వచ్చేది కాదు.

ఐదేళ్ళు భ్రమల్లో గడిపేసి జనాలను, భూములిచ్చిన రైతులను కూడా మోసం చేసిన చంద్రబాబే అమరావతికి తీరని నష్టం చేశాడు. అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించాడంటే అందుకు చంద్రబాబు చేతకాని తనమే కారణం. తన ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు వాస్తవ పరిస్ధితికి దగ్గట్లుగా నడుకునుంటే ఇపుడు జగన్ కు రాజధాని తరలించాలనే ఆలోచన వచ్చేదే కాదు. రాజధాని నిర్మించే అవకాశం వచ్చినా చేతులార చెడగొట్టుకున్న చంద్రబాబు ఇపుడు జగన్ పై ఏడిస్తే ఉపయోగం ఏముంటుంది. జగన్ చంద్రబాబును లెక్క చేయటం లేదు. ఈ నాలుగేళ్ళ‌ల్లో జగన్ ఏమి చేస్తాడో ప్ర‌జ‌లు గమనిస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *