తన తండ్రి సజీవంగా ఉన్నారు, చికిత్స కొనసాగుతోందిః అభిజిత్ ముఖర్జీ

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఢిల్లీ కంటోన్మెంట్‌లో గల ఆర్మీ రెఫరల్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హీమోడైనమికల్లీగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్థిరంగా ఉంది. తన తండ్రి సజీవంగా ఉన్నారని, ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తడం పట్ల అభిజిత్ ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై ఫేక్‌న్యూస్‌ను సృష్టించడం సరికాదని చెప్పారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయనకు సర్జరీ చేశారు. అదే సమయంలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఆయనను వెంటిలేటర్‌పై అత్యవసర వైద్య చికిత్సను అందిస్తున్నారు ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *