కరోనా తీవ్ర‌త ఇంకా పెరుగుతుందిః ఎయిమ్స్ డైరెక్టర్

దేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కేసులు మరింత వేగంగా పెరుగే అవకాశం ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. ప్రతిరోజూ 50వేల నుంచి 55 వేల కొత్త కేసులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, డాక్టర్ రణదీప్ గులేరియా ప్రకటన ఆందోళన కలిగిస్తుంది.

కరోనా మహమ్మారిని నియంత్రణకి ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సభ్యుడైన డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. దేశంలో వ్యాక్సిన్ (టీకా) ను అభివృద్ధి చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలని ప్రపంచంలోని 60 శాతం టీకాలు ఇక్కడ తయారవుతుండగా.. పెద్ద సంఖ్యలో టీకాలు తయారు చేసే సామర్థ్యం మనకు ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లపై ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. అదేవిధంగా, భారత్ బయోటెక్ మరియు జైడస్ కాడిలా కంపెనీ కూడా వేర్వేరు టీకాలను అభివృద్ధి చేశాయి. అదే సమయంలో, అనేక దేశాల ఉమ్మడి ప్రయత్నాల్లోలు టీకా అభివృద్ధి చేస్తున్నాయి.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *