అమీన్‌పూర్ అనాథ శరణాలయం బాలికపై లైంగిక దాడి, మృతి ఘటనపై ప్రత్యేక కమిటీ

హైదరాబాద్‌: అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు అనాథ శరణాలయంలో బాలిక లైంగిక దాడికి గురై మృతి చెందిన ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కమిటీలో బాలల హక్కుల కమిషన్‌, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్‌ సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మహిళా కమిషన్‌ కార్యదర్శి జి. సునంద కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై.. ఆ తర్వాత బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కలువనుంది. ఆశ్రమం నుంచి తీసుకువచ్చాక ఏం జరిగిందనే దానిపై వివరాలను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *