రాజధాని శంకుస్థాపనకు మోడీని ఆహ్వానిస్తాం : మంత్రి బొత్సా

చంద్రబాబు తన ఉనికి కోసమే రాజకీయాలు చేస్తున్నారని, ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని బొత్స విమర్శించారు. వైజాగ్ లో రాజధాని ఏర్పాటు జరిగి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ బల్లగుద్ది మరీ చెప్పారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖలు చేశారు. విశాఖ లో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోడీతో పాటు,అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని, మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరినీ ఆహ్వానిస్తాం కదా అంటూ వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, అందుకే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖలో రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *