కాబోయే అమెరికా అధ్యక్షుడు…..జో బైడెన్!

అగ్రరాజ్యం అమెరికాలో ఈ దఫా ఎవరు అధ్యక్షుడవుతాడో ముందే చెప్పేస్తే.. గెలుస్తారని అంచనా వేసిన పక్షంలోని నేతల ముఖాలు వెలిగిపోతే, ఓడతారని తేల్చేసిన పక్షంలోని నేతల ముఖాలు వాడిపోతాయి. సరిగ్గా ఇప్పుడు అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో 3 నెలలకు ముందే నూతన దేశాధ్యక్షుడు ఎవరో ఒక పెద్దాయన చెప్పేశారు. గత 40 ఏళ్లుగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రేపటి అమెరికా అధ్యక్షుడు ఎవరు అనే విషయాన్ని అత్యంత కచ్చితంగా చెబుతూ వచ్చిన వ్యక్తి నుంచి వచ్చిన ముందస్తు జోస్యం అది. వాస్తవానికి అది జోస్యం కాదు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన 13 సూత్రాల ప్రాతిపదికన అత్యంత శాస్త్రీయంగా మదించి నిర్ధారించే అంచనా అది. దాని సృష్టికర్త అల్లాటప్పా వ్యక్తి కాదు. అమెరికన్ ప్రొఫెసర్ అలెన్ లిచ్‌ట్మాన్ అంచనా అది.వివరాల్లోకి వెళితే.. అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కచ్చితంగా చెబుతున్నారు. ఇన్నేళ్లలో ఆయన వేసిన అంచనా ఎప్పుడూ తప్పలేదు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారో తాజాగా ప్రకటించారు. 13 సూత్రాల ఆధారంగా నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో 2016 ఎన్నికల సమయంలో కూడా హిల్లరి క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధిస్తారని ఈయన ప్రకటించారు. అలన్ లిచ్ట్మాన్ చెప్పినట్టుగానే.. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి.. అధికారం చేపట్టారు.

ఇప్పుడు 2020 నవంబర్ ఎన్నికల్లో కూడా ఎవరు గెలవనున్నారో.. ఎవరు ఓడిపోనున్నారో 3 నెలలకు ముందే చెప్పేశారీ ప్రొఫెసర్. ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యతిరేకత, సామాజిక అశాంతి, కుంభకోణాలు, అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మా వంటి 13 అంశాల ప్రాతిపదికన ప్రొఫెసర్ అలెన్ భావి అమెరికన్ అధ్యక్షుడిగా ఎవరు కానున్నారో చెప్పేశారు.1982 నుంచి ప్రతి ఎన్నికలోనూ అమెరికా భావి అధ్యక్షుడు ఎవరనే దానిపై ప్రొఫెసర్ అలెన్ ముందస్తుగా అంచనా వేస్తున్నారు. అలా విజేత ఎవరో చెప్పేముందు ప్రతి సారీ తాను తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ వచ్చానని కానీ ప్రతిసారీ విఫలం కాకుండా నా అంచనానే నిజమవుతూ వచ్చిందని అలెన్ చెప్పారు.

ప్రొఫెసర్ అలెన్ కి ఇప్పుుడ 73 ఏళ్లు. పోలింగ్ శాతం, పండితుల విశ్లేషణలు.. రోజువారీ ప్రచార మలుపులు ఇవన్నీ పక్కన బెట్టి ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నదే తన అంచనాకు ప్రాతిపదిక అని గత 40 ఏళ్లలో ఈ ప్రాతిపదిక మీదే భవిష్యత్ అమెరికా అధ్యక్షుడు ఎవరని అంచనా వేస్తున్నాని ప్రొఫెసర్ అలెన్ చెప్పారు. ప్రొఫెసర్ అలెన్ ప్రకారం ఈసారి అమెరికా ఎన్నికల్లో గెలుపు సాధించేది.జో బిడెన్. ఓడేది డొ నా ల్డ్ ట్రంప్.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *