ఇంత ఆవేశం అవసరమా….ఇక‌నైనా మారండి!

మనం మన భారతదేశంలో కేవలం 20% ఉంటాం !
ఆర్థికంగా చాలా వెనుకబాటులో ఉన్నాం !
గత కీర్తులే తప్ప వర్తమానపు అభివృద్ధులు లేవు.
ఉన్న అందరం చెల్లాచెదురుగా ఎవరివారే అన్నట్టుగానే ఉన్నాం.
ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నాం.
ఇంకా తింటూనే ఉన్నాం.
మన శత్రువు మనలను ఏదో ఒకటి చేసి కవ్విస్తూనే ఉంటాడు.
మనం రోషానికో ఆవేశానికో పోతే మనమే నష్టపోతున్నాం .
మనం శత్రువు ఉచ్చులో చాలా సులువుగానే పడిపోతున్నాం.
పోలీసు బుల్లెట్లు, మీడియా తిట్లు అన్నీ మళ్ళీ మనకే తగులుతాయి .
శత్రువులందరు మళ్ళీ ఏకమౌతారు.
మన ప్రాణాలే గాల్లో లేస్తుంటాయి.
మన పెళ్ళాల పుస్తెలే తెగిపడతాయి
మన పిల్లలే మళ్ళీ అనాధలౌతారు .
శత్రువులే మన టోపీల్లో వస్తుంటారు
మనపేరున రచ్చచేసిజారుకుంటారు
పోలీసులు రజాకార్లుగ మారుతారు
లేని సెక్షన్లన్నీ మనమీదే పెడతారు.
మన బిడ్డల చదువులే పోతాయి.
మనకుటుంబాలె బజారుకెక్కుతయి
చివరకు ఎవరికివారే యమునా తీరే
కథ అలా కంచికి నువ్వు ఇలా జైలుకి

ఇక చెప్పన్న! మనకు ఇంత ఆవేశం అవసరమా?
ఇస్లాం అంటేనే శాంతి అన్నమాటని మరచి పోదామా?
అందరి చేత ఆవేశపరులమే కాని ఆలోచనాపరులం కాదని అనిపించు కుంటూనే ఉందామా?
సహనపరుల వెంటనే అల్లాహ్ ఉన్నాడని గట్టిగ చెప్పిన కుర్‌ఆన్ మాటలను విడిచిపెడదామా?
ఇక నైనా ఆవేశానికి నిండు పాతర వేద్దాం ! మన జాతిని నిర్మిద్దాం !
మనం మన బిడ్డల్ని చదివిద్దాం.
మన తప్పుల్ని సరిదిద్దుకుందాం .
మన వ్యసనాలను తొలగిద్దాం .
ఆర్థికంగా బల పడదాం .
రాజకీయంగా సంఘటితమౌదాం .
శత్రువుని సరిగ్గా అంచనా వేద్దాం .
మన ధరాన్ని మంచిగ ఆచరిద్దాం .
మన హక్కులకై పోరాడదాం .
న్యాయమూర్తులంగా తీర్పులిద్దాం .
కలెక్టర్లుగా దేశాన్ని పాలిద్దాం .
శాస్త్రవేత్తలంగా ఆకాశాన్ని చూద్దాం .
ముస్లింలుగా ముహ్మద్లా జీవిద్దాం .
మన దేశాన్ని మళ్ళీ పాలిద్దాం .
మువ్వన్నెలను రెపరెప లాడిద్దాం .
మనశక్తి అజేయమని చాటిద్దాం !!

అల్‌ కమర్ , నిజాంపట్నం .
( బెంగళూరు గొడవల కోణంలో)

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *