సస్టెయినబల్‌ కార్యక్రమాల కోసం రెండు అవార్డులను అందుకున్న గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌

ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ వ్యాపారానికి ఇంధన నిర్వహణలో శ్రేష్టత కోసం సీఐఐ నేషనల్‌ అవార్డ్‌ మరియు సీఐఐ ఎన్విరాన్‌మెంటల్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు 2020

సెప్టెంబర్‌ 2020 ః చింతపల్లిలోని గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ (ఓపీపీ) ప్లాంట్‌కు 21వ నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ 2020 వద్ద ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫిషీయెంట్‌ యూనిట్‌గా గుర్తింపు లభించింది. ఇంధన సామర్థ్యంలో  సంస్థ పనితీరు మరియు సాధించిన విజయాలకు గుర్తింపు ఈ అవార్డు. సీతానగరంలోని వీరి ప్లాంట్‌కు సైతం సీఐఐ ఎన్విరాన్‌మెంటల్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అవార్డ్‌ 2020ను అందించడంతో పాటుగా గత నెల వ్యర్థాల నిర్వహణలో చూపిన ప్రయత్నాలకు గానూ ఇన్నోవేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాజెక్ట్‌గా సైతం గుర్తించారు.

ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ వ్యాపారం స్ధిరంగా సస్టెయినబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యక్రమాల కోసం గౌరవించబడుతుంది.

ఈ అవార్డులను అందుకున్న సందర్భంగా తన ఆనందాన్ని శ్రీ నసీమ్‌ ఆలీ, సీఈవో, గోద్రేజ్‌ అగ్రోవెట్‌, ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్స్‌ వ్యక్తీకరిస్తూ ‘‘ఎలాంటి నూతన సాంకేతిక పెట్టుబడిలో అయినా సస్టెయినబిలిటీకి భరోసా అందించాలన్నది మా లక్ష్యం. మరింత సమ్మిళిత మరియు ఆహ్లాదకరమైన భారతావనిని సృష్టించాలనే ప్రయత్నంలో, గోద్రేజ్‌ వద్ద మేము మా కార్యక్రమాలను చక్కటి– కమ్యూనిటీ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు మరియు గ్రీన్‌ –పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలుగా చేస్తున్నాం. మా ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాం’’ అనిఅన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *