జయ ప్రకాశ్ మృతికి ప్రముఖుల నివాళి

విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) ఈ రోజు ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి శ్వాస అందక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. అయితే మంగళవారం ఉదయం సడెన్‌గా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన మృతి ఎన్నో లక్షల మంది అభిమానులకి తీరని శోకాన్ని మిగిల్చింది.

జయప్రకాశ్ రెడ్డి మృతికి టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు. చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ద్వారా.. జయప్రకాష్ రెడ్డి గారు మరణంతో తెలుగు సినిమా, థియేటర్ మూగబోయింది. ఆయన చేసిన బహుముఖ ప్రదర్శనలు, మరపురాని సినిమాలతో ఎన్నో దశాబ్దాలుగా అలరించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.  ఇక తెలుగు సినీ పరిశ్రకు సంబంధించి అనీల్ రావిపూడి, సుధీర్ బాబు, గోపిచంద్ మలినేని తదితరులు ఆయన మృతికి నివాళులు అర్పించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *