ఉన్నత విద్యా సంస్థలు, పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు

★ కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ.

★ తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత పాటించేలా, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన అన్ని ప్రామాణిక నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

★ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు స్వచ్ఛందంగా వచ్చి ఉపాధ్యాయుల వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్న 9-12వ తరగతి విద్యార్థులకుగాను ప్రత్యేక సూచనలను విడుదల చేసింది.

★ ఈ నెల 21 నుంచి తల్లిదండ్రుల అనుమతితో ఆయా తరగతుల విద్యార్థులు పాఠశాలలకు రావడానికి కేంద్రం అనుమతించిన విషయం విదితమే.

★ తరగతి గదుల నిర్వహణ, రవాణా సదుపాయాలతో పాటు పాఠశాలల్లో పాటించాల్సిన అన్ని జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

★ విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపింది.

★ పాఠశాలల పునఃప్రారంభానికి ముందస్తు ప్రణాళిక కంటైన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న పాఠశాలల్ని తెరవొచ్చు.

★ కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలల్లోకి అనుమతి లేదు.

★ కంటైన్‌మెంట్‌ జోన్లలోకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్ల కూడదు.

★ పాఠశాలల్లోని ప్రయోగశాలలు, ఎక్కువగా సంచరించే ప్రదేశాలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేయాలి.

★ క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించిన పాఠశాలలను తప్పని సరిగా నిబంధనల ప్రకారం శానిటైజ్‌ చేయాలి.

★ ఉపాధ్యాయులు, సిబ్బంది 50శాతం మంది హాజరయ్యేలా చూడాలి.

★ బయో మెట్రిక్‌ హాజరు పద్దతి అవసరం లేదు.

★ ఉపాధ్యాయులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీలుంటే ఆరు బయట కూర్చొనేలా చూడాలి.

★ ప్రాంగణంలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనే ఏర్పాట్లు ఉండాలి.

★ ‘క్యూ’ పద్ధతి పాటించే విషయంలో ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్‌ చేయాలి.

★ సమావేశాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు సహా ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలు నిషేధం

★ ప్రతి పాఠశాలలోనూ రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబరు, స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్‌ నంబర్లు ప్రదర్శించాలి.

★ తరగతి గదుల్లో ఏసీ, వెంటిలేషన్‌ తదితర అంశాల్లో సంబంధిత మార్గదర్శకాలు అమలుచేయాలి.

★ స్విమ్మింగ్‌ పూల్‌ తప్పని సరిగా మూసివేయాలి.

పాఠశాలలు తెరిచిన తర్వాత …

★ విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. వాటి వద్ద పరిశుభ్రత పాటించాలి. థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి.

★ కరోనా లక్షణాలు లేనివారిని అనుమతించాలి.

★ కరోనా జాగ్రత్తలకు సంబంధించి గోడపత్రికలు డిస్‌ప్లే చేయాలి.

★ ఏ ప్రాంతంలోనూ ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.

★ సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.

తరగతి గదుల్లో…

★ విద్యార్థులు కూర్చొనే చోట ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి.

★ తరగతి జరుగుతున్నంత సేపు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కు ధరించే ఉండాలి.

★ నోట్‌బుక్‌, పెన్నులు, పెన్సిళ్లు, మంచినీరు బాటిళ్లు తదితర వస్తువులు ఏవీ కూడా ఇతర విద్యార్థులతో పంచుకోకుండా చూడాలి.

ప్రయోగశాలల్లో …

★ ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్‌ సమయంలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలి.

★ ఉపయోగించే పరికరాలన్నిటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

★ పరికరాలు ఉపయోగించే ముందు తర్వాత చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి.

గ్రంథాలయాల్లో…

★ ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి

★ మాస్కు తప్పనిసరిగా ధరించాలి

★ కేఫ్‌టేరియా, మెస్‌ సౌకర్యాలు మూసివేయాలి.

రవాణా, ఇతరత్రా సమయాల్లో…

★ బస్సులు, ఇతరత్రా రవాణా సాధనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడంతోపాటు సామాజిక దూరం పాటించేలా చూడాలి.

★ పాఠశాల ప్రాంగణం రోజూ శుభ్రం చేయాలి.

★ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను శానిటైజ్‌ చేయాలి.

★ మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి.

★ విద్యార్థులతో పరిశుభ్రత పనులు చేయించరాదు.

★ విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పించాలి.

★ పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్‌ చేసి ప్రత్యేక గదిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలి.

ఉన్నత విద్యా సంస్థల్లో పాటించాల్సిన జాగ్రత్తలు..

★ పరిశోధన, వృత్తిపరమైన కోర్సులు నిర్వహించే సంస్థల్లో ప్రయోగశాలలకు అనుమతులు కరోనా ప్రామాణిక నిర్వహణ నిబంధనలకు లోబడి ఉండాలి.

★ నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ఉపయోగించే పరికరాల మధ్య దూరం ఆరు అడుగులు ఉండాలి. స్థలం అందుబాటులో ఉంటే ఆయా పరికరాలను ఆరుబయట లేదా వరండాలలో అమర్చి భౌతిక దూరం పాటించేలా చూడాలి.

★ ఆన్‌లైన్‌ తరగతులు, రెగ్యులర్‌ తరగతులు సమ్మిళితంగా కొనసాగాలి.

★ రెగ్యులర్‌ తరగతి గదుల్లో విద్యార్థుల రద్దీని తగ్గించేందుకు, భౌతిక దూరం పాటించేందుకు వేర్వేరు టైమ్‌ స్లాట్‌ను అమలు చేయాలి.

★ ఆరు అడుగుల దూరం పాటిస్తూ సిటింగ్‌ ఏర్పాట్లుండాలి.

★ వసతి గృహాల్లోనూ పడకల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి.

★ వైరస్‌ సోకిన విద్యార్థులకు వెంటనే ప్రత్యేక గదులు కేటాయించాలి. వైద్య సదుపాయం కల్పించాలి.

★ ఆహారశాలల్లో రద్దీ నివారణకు భోజన సమయాలను వేర్వేరుగా కేటాయించాలి.

★ చేతులు శానిటైజ్‌ చేసుకొనే వసతులు అందుబాటులో ఉండాలి.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *