జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనని…కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై విరుచుకుపడ్డారు. కమలా హ్యారిస్‌ను ప్రజలు ఇష్టపడరని.. ఆమె అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశమే లేదన్నారు. ఒకవేళ కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నప్పటికి.. జో బైడెన్ ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం ఆసక్తికరంగా ఉందని ట్రంప్ అన్నారు.

ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థగా అమెరికాను నిర్మించామని.. చైనా వైరస్ వల్ల ఆ వ్యవస్థను మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనని.. జో బైడెన్ విధానాల వల్ల అమెరికా పతనమవుతుందని చైనాకు తెలుసన్నారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మరోమారు పోటీ చేస్తుండగా.. డెమొక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బరిలో ఉన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *