బెహ్రెయిన్ ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందం

ఇజ్రాయిల్‌తో మరో అరబ్ దేశం శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బెహ్రెయిన్ దేశం ఇజ్రాయిల్‌ దేశంతో శాంతి ఒప్పందం చేసుకుంది. దీంతో ఒక నెలలోనే రెండు అరబ్ దేశాలు ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపడం విశేషం. ఇందులో వైట్‌హౌజ్ పాత్ర కీలకంగా ఉందని సమాచారం.

కొన్ని దశబ్దాలుగా చాలా అరేబియన్ దేశాలు ఇజ్రాయిల్‌ను నిషేధించాయి. పాలస్తీనా ఇజ్రాయిల్ దేశాల మధ్య వివాదాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే ఇజ్రాయిల్‌తో స్నేహం కొనసాగిస్తామని చెప్పుకొచ్చాయి. అయితే గత నెలలోనే ఇజ్రాయిల్ దేశంతో సంబంధాలు నెరిపేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకారం తెలిపింది. అయితే బహ్రెయిన్ కూడా యూఏఈని ఫాలో అవుతుందని వచ్చిన వార్తలు ఇప్పుడు వాస్తవరూపం దాల్చాయి. ఇజ్రాయిల్-పాలస్తీనల మధ్య కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించేందుకు అదే సమయంలో మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతికోసం తాను ప్రణాళిక చెప్పడంతో దీనిపై విశ్వాసం ఉంచిన రెండు దేశాలు ఇజ్రాయిల్‌తో స్నేహం కొనసాగించేందుకు ముందుకొచ్చాయి. 1948లో ఏర్పాటు అయిన బహ్రెయిన్ దేశం… మధ్య ప్రాచ్య దేశాలు అయిన యూఏఈ, ఈజిప్టు, జోర్డాన్ తర్వాత ఇజ్రాయిల్‌తో కలిసి నడిచేందుకు ఒప్పుకున్న నాల్గవ దేశంగా నిలిచింది.

ఇజ్రాయిల్ బెహ్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ శాంతియుత ఒప్పందం చారిత్రాత్మక ఒప్పందంగా ట్రంప్ అభివర్ణించారు. తమ రెండు మిత్రదేశాలు శాంతియుత వాతావరణంపై ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య జరిగిన శాంతియుత ఒప్పందంకు సంబంధించిన సంయుక్త ప్రకటనను ట్వీట్ చేశారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం, భద్రత, సామరస్యం నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్.

ఇజ్రాయిల్‌తో మరో అరబ్ దేశం శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావడాన్ని స్వాగతించారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ. గత కొన్నేళ్లుగా శాంతి మంత్రాన్ని పాటించేందుకు ఇజ్రాయిల్ ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఇక ప్రశాంతతకు కొత్త శకం ప్రారంభమైందని అన్నారు నెతన్యాహూ. అంతేకాదు ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పిన బెంజమిన్ నెతన్యాహూ… శాంతియుత వాతావరణం కోసం చాలా ఏళ్లుగా పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు అదే శాంతియుత వాతావరణం పెట్టుబడులు పెడుతోందని అన్నారు. ఇజ్రాయిల్‌కు అరబ్ దేశాల మధ్య శాంతియుత వాతావరణం కల్పించేందుకు స్నేహం పెంపొందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన అల్లడు జేర్డ్ కుష్నర్‌ల కృషి ఎంతో ఉంది. యూఏఈ, బహ్రెయిన్ దేశాల మధ్య ఇజ్రాయిల్‌తో ఒప్పందం చేసుకునేందుకు వీరి పాత్ర చాలా ఉంది.

ఇదిలా ఉంటే భవిష్యత్తులో మరిని మధ్య ప్రాచ్య దేశాలు ఇతర ముస్లిం దేశాలు ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంటాయనే విశ్వాసం తమకుందని వైట్‌ హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జరిగిన ఈ ఒప్పందాల వెనక ట్రంప్ కృషి ఉండటంతో ఆయన ఎన్నికల ప్రచారంకు ఈ అంశం ఉపయోగపడుతుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అరబ్ దేశాలకు ఇజ్రాయిల్ దేశానికి శాంతి ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ సక్సెస్ కావడంతో గతంలో పాలస్తీనా- ఇజ్రాయిల్ దేశాల మధ్య శాంతియుత ఒప్పందం తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన విషయం మరుగున పడింది. అది శతాబ్దపు ఒప్పందంగా పేర్కనడం జరిగింది. కానీ ట్రంప్ కేవలం ఇజ్రాయిల్ వైపునుంచే మాట్లాడుతుండటంతో ఇది నచ్చని పాలస్తీన వెనక్కు తగ్గింది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *