శృంగార తార…. షూటింగ్స్ మిస్‌ అవుతోంద‌ట‌!

article image

‘పద‌కొం‌డేళ్లకి ముద్దు రుచి చూశా. పద‌హా‌రేళ్లకు కన్య‌త్వాన్ని కోల్పోయా..’నంటోంది సన్నీలియోనీ…… ఏమీ దాచు‌కో‌లే‌ని‌దాన్ని, ఇక ఇలాంటి నిజాలు మాత్రం దాచుకోవడం ఎందుకు అనేది ఆమె అభిప్రాయం. కుర్రకారు గుండెల్లో అందాల కుంపట్లు రగి‌ల్చిన శృంగార తార… సన్నీ. పాలపొంగులాంటి ఆమె సొగసులకు ప్రపంచమంతా అభిమానులున్నారు. ‘జిస్మ్‌ 2’ కోసం హిందీ తెరపైకొచ్చే‌వ‌రకు ఆమె గురించి మనలో చాలా‌మం‌దికి తెలియదు. కానీ పాశ్చాత్య దేశాల్లో సన్నీ అప్పటికే ఓ సంచ‌లనం. అడల్డ్‌ ఇండ‌స్ట్రీలో ఆమె ఓ వ్యాపార మంత్రం. ఫోర్బ్స్‌ పత్రిక సైతం ఆమె గురించి ప్రస్తా‌విం‌చింది. సన్నీ శృంగార చిత్రాల్లో నటిం‌చ‌డమే కాదు… నిర్మిం‌చింది, దర్శ‌కత్వం కూడా వహిం‌చింది. బిగ్‌బాస్‌ షోతో మన దేశంలోకి అడు‌గు‌పె‌ట్టింది. ఆ షో తర్వాత హిందీలో నటించే అవ‌కా‌శాలు అందు‌కొంది. ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో సన్నీలియోన్‌ ఓ సంచలనం, ఒక ప్రత్యే‌క‌మైన తార. ఆమె కోసం అన్ని భాషా చిత్ర సీమలు ఎదురుచూస్తున్నాయి. ‘కరెంటుతీగ’లాంటి తన వంపుసొంపులతో టాలీవుడ్‌ ఇండస్ట్రీని తన మత్తులోకి దింపేసుకుంది. తను తెరపై కనిపిస్తే చాలు ‘‘డియో డియో..’’ అంటూ కుర్రకారు ఉర్రూతలూగిపోతారు. ప్రత్యేక గీతాలకు సన్నీ పెట్టింది పేరు. అందుకే ఆమెతో వెండితెరపై చిందేయించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్రత్యేక గీతాలు సిద్ధమవుతునే ఉంటాయి. ప్రస్తుతం ఎంతో మంది దర్శ‌కులు సన్నీనే ప్రధాన పాత్రగా చేసి సినిమాలు తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.

article image

తన మన‌సును పూర్తిగా అర్థం చేసు‌కొన్న డేనియల్‌ వెబె‌ర్‌తో జీవి‌తాన్ని పంచు‌కొంది సన్నీ. వారిద్దరి జీవితం ఇప్పుడు అన్యో‌న్యంగా సాగు‌తోంది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలున్నారు. తొలుత 2017లో మహారాష్ట్రకు చెందిన రెండేళ్ల పాపను దత్తత తీసుకున్నారు సన్నీ దంపతులు. ఆ పాపకు నిషా వెబర్‌ కౌర్‌ అని పేరుపెట్టుకొన్నారు. అయితే తాజాగా వారిద్దరూ సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. వీరికి ఆషర్‌ సింగ్‌ వెబర్‌.. నోవా సింగ్‌ వెబర్‌ అని పేర్లు పెట్టుకొన్నారు. ప్రస్తుతం సన్నీలియోన్‌ ఈ ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఎంతో మురిసిపోతోంది.

article image

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో భర్త, పిల్లల్తో కలిసి సన్నీ లాస్‌ఏంజెల్స్‌లోని తన అత్తవారింటికి వెళ్లారు. వృత్తిపరమైన జీవితం నుంచి చిన్న విరామం దొరకడంతో కుటుంబసభ్యులతో కలిసి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడుపుతున్నారు. షూటింగ్స్‌ను బాగా మిస్సవుతున్నానని ఆమె తెలిపారు. ‘కరోనావైరస్‌ విజృంభణ నానాటికి పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రయాణాలకు కూడా అనుమతినిస్తున్నారు. దీనివల్ల వైరస్‌ మరింత ఎక్కువమందికి వచ్చే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే షూటింగ్స్‌ను బాగా మిస్‌ అవుతున్నాను. వెంటనే సెట్‌లోకి అడుగుపెట్టి నా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించాలని ఉంది. కానీ పని కంటే ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం కదా.’

‘బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇక్కడి వాళ్లు నన్ను ఆదరించారు. ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించారు. అద్భుతాలు జరిగినట్లు సులువుగా నేను ఇక్కడికి రాలేదు. మిగతావాళ్లకంటే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. కఠినమైనదే అయినప్పటికీ నాకంతా మంచే జరిగింది. మిగిలిన వాళ్లతో పోలిస్తే నా సినీప్రయాణం చాలా విభిన్నంగా ఉంటుంది. బీటౌన్‌లోకి వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు నన్ను అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ ఓ నటిగా వాళ్లు అంగీకరించడం అదృష్టంగా భావిస్తున్నా. ముంబయికి వచ్చిన కొత్తలో నా అభిమానులు నాకందించిన ప్రోత్సాహం ఎంతో విలువైనది. వాళ్లే నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేనీస్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వాళ్లే. ఒకవేళ వాళ్లే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు.’ అని తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *