పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తున్న భూమిలో అడుగడుగునా అవినీతి, అక్రమాలు, భారీ భూస్కాoలు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఎందుకు ఇవ్వరు? మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య.

ఆదివారం ఉదయం పసుపు చైతన్యం లో భాగంగా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామము నందు దేశం నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కేటాయించిన సర్వే నెంబర్ 232, 233 లోని ఇళ్ళ స్థలాలను పరిశీలించారు అనంతరం తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో భారీ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆమె మండి పడ్డారు. సర్వే నెంబర్ 232 లోని 44 ఫ్లాట్ ల స్థలాలు రోడ్ కు అనుకొని ఉండటం భవిష్యత్తులో రోడ్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లయితే లబ్దిదారులు ఏమి కావాలి అలానే సర్వే నెంబర్ 233 లో 7 ఫ్లాట్లకు కేటాయించిన స్థలాలకు దగ్గరగా మంచి నీటి పైప్ లైన్ ఉండటం దాని ద్వారా ప్రజలకు నీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున లబ్దిధారులు ఏమి కావాలని ఆమె ప్రశ్నించారు?

పేదలకు కేటాయించిన సర్వే నెంబర్ 232, 233 లోని ఇళ్ళ స్థలాలు బురద కయ్యలుగా, చిత్తడి గుంటలతో నిండి ఉన్నాయని ఆమె తెలిపారు.

నిన్న నందిగామ మండలం పల్లగిరి గ్రామము నందు పల్లగిరి గట్టు అంతా అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరుపుచుండగా అడ్డుకోవడం జరిగినది.ఆ క్రమములో భాగంగా గ్రావెల్ త్రవ్వకాలకు సంబందించిన కాగితాలు, అనుమతులు చూపామని ప్రశ్నిస్తే సమాధానం లేదని అధికార పార్టీ నాయకులకు జేబులు నింపుకోవడానికీ సహజ వనరులు ఒక నిధిలా మారాయి అని తంగిరాల సౌమ్య మండిపడ్డారు.

నందిగామ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతినిధులు నాలుగుమండలాలలోని ప్రతి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనే పేరుతో అన్నిచోట్ల భూదందాలు కొనసాగించారని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం మౌనం వహిస్తూ ఎందుకు నోరు మెదపడం లేదని తంగిరాల సౌమ్య ప్రశ్నించారు. అధికారులు అనేవారు పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించలే కానీ విధులలో అలసత్వం వహించరదని ఈ భూదందాల లో జరిగిన అక్రమాలను అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు ఎల్లప్పుడు సిద్ధమేనని ఆమె తెలియజేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *