వైఎస్ జగన్ బయోపిక్ ‘యాత్ర-2’లో హీరోగా నాగార్జున!

వైఎస్ పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ దర్శకత్వం వహించిన మహీ రాఘవ. మహీ దర్శకత్వంలోనే ‘యాత్ర-2’

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తయారైన ‘యాత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించిన మహీ వీ రాఘవ, అప్పటి నుంచి మరో చిత్రం చేయలేదన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆ తరువాత, వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకూ జరిగిన కథతో ‘యాత్ర-2’ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో జగన్ తెర జీవిత పాత్రను ప్రముఖ నటుడు నాగార్జున పోషించనున్నాడని సమాచారం. మహీ వీ రాఘవ చెప్పిన స్క్రిప్ట్ పై నమ్మకంతో నాగ్, ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో అధికారిక స్పందన వెలువడాల్సి వుంది. ఈ వార్తే నిజమై, నాగార్జున, తెరపై జగన్ పాత్రను పోషిస్తే, సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడటం ఖాయం.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *