దేవాదాయ ధర్మాదాయ శాఖకు పట్టిన గ్రహణం వెల్లంపల్లి శ్రీనివాస్ : జనసేన

దేవాదాయ ధర్మాదాయ శాఖకు పట్టిన గ్రహణం వెల్లంపల్లి శ్రీనివాస్

* ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ ర్యాంకులు ఇస్తే మొదటి ర్యాంక్ వెల్లంపల్లిదే

* అంతర్వేది రథం తయారయ్యాక మత్స్యకారుల సంప్రదాయాలను కొనసాగిస్తారో లేదో చెప్పాలి

* జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కు పట్టిన అతిపెద్ద గ్రహణం ఆ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ అన్నారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖను అధర్మం, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని మండిపడ్డారు.

మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని శ్రీ వెల్లంపల్లి అక్రమాలకు పాల్పడుతున్నారన్న శ్రీ పోతిన మహేష్… రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల నుంచి వస్తున్న ఆదాయాలు ఆస్తులు ఎంత?

దేవాలయాల అభివృద్ధి, హిందు ధర్మ ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నది ఎంత?

అన్నదానిపై వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సోమవారం సాయత్రం విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. “వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం చేయడం జరుగుతున్నాయి.

ఒక్కటంటే ఒక్క ఘటనపై కూడా మంత్రి గారు చర్యలు తీసుకోలేదు.

కనీసం దాడులు జరిగిన ప్రాంతాల్లో కూడా సందర్శించలేదు.

ప్రజాగ్రహం తప్పదని అంతర్వేది వెళ్లారు అంతే.

ఇలాంటి మంత్రి ఉండటం ఆంధ్రరాష్ట్రం చేసుకున్న దౌర్భగ్యం.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చిందని చెబుతున్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ కరెప్షన్ లో ర్యాంకులు ప్రకటిస్తే రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి స్థానం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికే వస్తుంది.

రాష్ట్రం మొత్తం మీద అవినీతి ఎలా చేయొచ్చో వెల్లంపల్లికి తెలిసినంత ఎవరికీ తెలియదు.

కరోనా వేళ కూరగాయల్లో కూడా రూ. 10 కోట్లు కొట్టేసిన ఘనత ఆయనది.

దుర్గ గుడి ఈవో పోస్టుకి పనికిరాడని హైకోర్టు చెప్పినా 9 నెలలుగా ఆయన్నే కొనసాగిస్తున్నారు.

రూ. 4 కోట్ల శానిటైజేషన్ కాంట్రాక్టు నామినేషన్ పద్దతిన ఇచ్చినా మంత్రిగారు మౌనంగా ఉంటారు.

రూ. 38 పాల టెండర్ ని రూ. 43 రూపాయిలకు కోట్ చేసినా అధికంగా డబ్బులు చెల్లిస్తారు. ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం కంప్లీట్ అయిన పనులకు రూ. 3 కోట్ల బిల్లులు మరలా పెట్టినా చెల్లించమని చెబుతారు.

సత్యనారాయణ పురంలో కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి వారి రూ. 10 కోట్ల విలువ చేసే కమర్షియల్ స్థలాన్ని మల్లాది విష్ణు గారితో కలిసి కొట్టేసిన ఘనత వెల్లంపల్లిది. అడుగడుగునా అవినీతే.

ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నుంచి అవినీతిరహిత పాలన సాధ్యపడే పనేనా?

పెద్ద పెద్ద ఆలయాల ఆస్తులు, ఆదాయాలన్నీ వైస్ జగన్ గారి కుటుంబ, సన్నిహితులు చూసుకుంటారు.

తిరుమల తిరుపతి దేవస్థానం సుబ్బారెడ్డి గారు, సింహాచలం భూముల వ్యవహారం విజయసాయి రెడ్డి గారు చూసుకుంటారు.

పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ జగన్ రెడ్డి గారి సన్నిహితులు, వారి కుటుంబ సభ్యులు చూసుకుంటారు.

దాని తర్వాతవన్నీ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సన్నిహితులు, వారి అనుచరులు చూసుకుంటారు.

దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్ని, భూముల్ని, ఆదాయాల్ని ఈ ప్రభుత్వంలో ఉన్న వారు పంచుకుంటున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

* అన్యమత ప్రచారం వద్దు అన్నందుకే…
తిరుమలలో అన్యమత ప్రచారం వద్దన్నందుకే ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిని ఏ మాత్రం ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారు.

ప్రశ్నించినందుకు ఆకస్మికంగా బదిలీ చేశారు.

అంతర్వేది ఘటనలో ఒక సమాచారం బయటికి చెప్పబోతే దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్ గారిని బదిలీ చేశారని సమాచారం.

ఈ ప్రభుత్వంలో హిందువుల మనోభావాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడితే వారిని వెంటనే ప్రాముఖ్యత లేని శాఖలకు బదిలీ చేస్తారా?

దీనికి సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

* నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలి
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ప్రాథమిక దర్యాప్తును ప్రభుత్వం తొక్కిపెడుతోంది.

దోషుల్లో వైసీపీకి చెందిన వాళ్లు ఉన్నారు కాబట్టే సమాచారాన్ని ప్రజలకు తెలియనివ్వడం లేదు.

దేవాలయాల భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారు.

తద్వారా ఆలయాల ఖ్యాతిని దిగజార్చాలనే దుర్మార్గమైన
ఆలోచన వైసీపీ ప్రభుత్వం చేస్తోంది.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.

పార్టీలు మారే నైజం ఉన్న వెల్లంపల్లి గారు రేపొద్దున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తల్లినే గెలిపించుకోలేకపోయావు నువ్వేం ముఖ్యమంత్రివి, నీదేం పార్టీ అని విమర్శించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

*:టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించాలి
మంత్రి వెల్లంపల్లి పదేపదే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం మానేసి తిరుమల తిరుపతి దేవాస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిగారిని ప్రశ్నించాలి.

సుబ్బారెడ్డి గారు నుదుటున బొట్టు పెట్టుకొని పంచె కట్టుకుని తిరుమల సంచరిస్తుంటే… ఆయన భార్య మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర బైబిల్ పట్టుకొని ప్రవచనాలు చదువుతున్నారు.

ఒకరేమో హిందువు, ఇంకొరేమో క్రిస్టియన్.

దీనిపై ప్రజల్లో చాలా కన్ఫూజన్ ఉంది. మంత్రిగారే క్లారిటి ఇవ్వాలి.

అలాగే మాన్సన్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత కూడా హిందువా? క్రిస్టియనా? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

గతంలో ఆమె అనేక సార్లు క్రిస్టమస్ పార్టీలు నిర్వహించారనే సమాచారం ఉంది.

దానిపై సమాధానం చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

హిందువా? కాదా అన్నది సమాధానం చెప్పకుండా ఇష్టానుసారం మాట్లాడితే హిందూ మత ధర్మాన్ని అపహాస్యం చేసినట్లే.

దానికి వైసీపీ ప్రభుత్వం వంతపాడుతున్నట్లేనని రాష్ట్రంలో హిందువులు అందరూ భావించాల్సి వస్తుంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా పీస్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా.

పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉంది.

వైఎస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఇవేమీ చాలకపోతే చివరికి మతాల మధ్య చిచ్చుపెట్టడం.

దేవాలయాల మీదే కాదు, దళితుల మీద కూడా దాడులు పెరిగి పోయాయి.

ఈ రెండింటినీ అరకట్టలేని అసమర్ధ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.

దీనిలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు ఉన్నాయి.

వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పందించడం లేదు.

హైకోర్టు డీజీపీకి రూల్ ఆఫ్ లా తప్పుతుందని అంక్షింతలు వేసే పరిస్థితి.

అంతర్వేదిలో ప్రభుత్వమే స్వామి వారి రథం తయారు చేస్తుంది, ఉత్సవాల నాటికి సిద్ధం అవుతుంది అని మంత్రి ప్రకటించారు.

అక్కడ రథాన్ని తీసుకురావడంలో, సంబంధిత ఉత్సవాలలో మత్స్యకారులకు కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయబద్ధమైన ఆచారాలు ఉన్నాయి.

దగ్ధమైన రథం కూడా మత్స్యకారులు చేయించిందే. ఇప్పుడు ప్రభుత్వం రథం చేయిస్తోంది
కాబట్టి మత్స్యకారులకు సంబంధించిన సంప్రదాయాలు కొనసాగిస్తారా లేదో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాలి.

మత్స్యకారులను పక్కనపెట్టి వైసీపీ వాళ్లతోనే రథం లాగిస్తాం అంటే కుదరదు” అన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *