ఉత్తమ నగరంగా హైదరాబాద్

దేశంలో నివాసయోగ్యమైన , ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా సర్వప్రధమ స్థానంలో నిలిచింది. హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు నిర్థారణ అయింది.
ఆయా సర్వేలు అంతర్జాతీయ స్థాయినైనా , జాతీయ స్థాయిలో అయినా అగ్రశ్రేణి స్థానంలో నిలవడం హైదరాబాద్ కు అలవాటైందనడం అతిశయోక్తి కాదు. ప్రపంచలో కెల్లా ప్రధమ స్థానంలో అత్యంత విశిష్ట నగరంగా నిలిపిన జె.ఎల్.ఎల్. సూచిక 2020 సర్వేలో ఈ ముత్యాల నగరం, అన్ని నగరాల్లో కెల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు 34 నగరాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నివాసయోగ్యం, వృత్తి ఉపాధుల నిర్వహణ అంశాలపై ఈ మేరకు సర్వే కొనసాగింది.
ఈ సైట్ ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాధాన్యతలపై గమ్యస్థానాలను ఎంపిక చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేయడంలో తోడ్పడుతుంది. దేశంలోని అత్యత్తమ నివాసయోగ్య నగరంగా ఎంపిక చేయడంలో సాంస్కృతిక సమ్మేళనం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలపై సర్వే చేయడం జరిగింది.
ఆయానగరాల్లో పటిష్టమైన అవకాశాలు, సదుపాయాలు, చక్కని రీతిలో ఆర్ధిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలతో సదరు సర్వే కొనసాగింది. ఈ మేరకు సాగిన సర్వేలో అయిదింట నాలుగు స్థాయిలను ముంబాయి, పుణే, చెన్నయ్, బెంగళూరు నగరాలను, నిజాంలు నిర్మించిన హైదరాబాద్ అదిగమించింది.
ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సెప్టెంబరు నెల నుంచి మార్చి నెల వరకు హైదరాబాద్ లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా రుజూవైంది. ఇక్కడి పర్యాటక కేంద్రాల్లో చరిత్రాత్మక చార్మినార్ , గోల్కొండ కోట, స్వప్నం

సాకారమైనట్టుగా రూపుదాల్చిన రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైనవి పర్యాటకుల దృష్టిని ఆకర్షించితీరుతాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా పర్యాటకులు అత్యధిక సంఖ్యలో నగరాన్ని సందర్శించేందుకు మార్గం సుగమమైంది.
హైదరాబాద్ నగరం శరవేగంగా దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలో పర్యటించే వారికి విశిష్ట గమ్యస్థానంగా సర్వేలో వెల్లడైంది.
ఆయా అంశాలప్రాతిపదిక పై ఇప్పటివరకు జరిగిన పలు సర్వేల్లో హైదరాబాద్ నగరం సర్వ ప్రధమ స్థానాన్ని పొందింది. వివిధ సంస్థలు పలు దశల్లో జరిపిన సర్వేల్లో ఈ వాస్తవం వెల్లడైంది. 2020 లో విశిష్ట నగరాల ఎంపిక పై జరిగిన సర్వేలో హైదరాబాద్ నగరం మొదటి స్థానం పొందడం తో పాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పోందింది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *