నూతన రెవెన్యూ చట్టం వల్ల గిరిజనుల, దళితులు మరింత లబ్ది

నూతన రెవెన్యూ చట్టం వల్ల గిరిజనుల, దళితులు మరింత లబ్ది పొందేందుకు, ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా చేరేందుకు, పోడు భూముల, అసైన్డ్ భూముల సమస్య తీర్చే విధంగా, ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాల లో న్యాయం చేసేలా చర్చించడం కోసం సీఎం కేసిఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీమతి సత్యవతి రాథోడ్ ల నేతృత్వంలో నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది.

దళిత, గిరిజనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్య్రమాలను చేస్తున్నా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చర్చించి చెప్పడానికి ఎస్సీ, ఎస్టీల ప్రతినిధులు సమావేశం కావాలని సీఎం కేసిఆర్ గారి ఆలోచన.

గతంలో కొన్ని ప్రకటించిన పథకాలు అమలు కాలేదు. వాటిని అమలు చేస్తే ఎలా ఉంటుందని చర్చించాలి. ఇంకా కొత్తగా ఏం చేస్తే ఈ వర్గాలకు ఉపయోగం ఉంటుందో చెప్పాలి.

గత కేబినెట్ సమావేశంలో కూడా సీఎం కేసిఆర్ గారు దళిత, గిరిజనులకు మేలు జరిగే అంశాలు చెప్పాలని అన్నారు.

ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా భావించి దళిత, గిరిజనులకు మేలు చేసే సూచనలు, సలహాలు ఇవ్వాలి.

మీకు ఉన్న పనులు వాయిదా వేసుకొని ఈ చర్చలో పాల్గొని ఉపయోగపడే అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి.

దళిత గిరిజన ప్రజాప్రతినిధులు అందరూ సమావేశమై ఈ రాష్ట్రంలో దళిత గిరిజన వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అందేదుకు, ఇంకా వారికి మేలు జరిగే విధంగా మరిన్ని కార్యక్రమాలు రూపొందించడానికి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం వల్ల దళిత గిరిజనులకు మరింత మేలు జరిగే విధంగా చూడాలని ఇందుకు ఎస్సీ, ఎస్టి ప్రజా ప్రతినిధులు సమావేశమై నివేదిక ఇవ్వమని కోరారు.

రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు కొన్ని భూమి సమస్యలు ఇంకా ఉన్నాయి ముఖ్యంగా ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నా ఫారెస్ట్ అధికారులతో వేధింపులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో వారికి పూర్తిస్థాయి భూమి హక్కులు ఎలా కల్పించాలన్నది చాలా ముఖ్యం.

ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాగా ఉన్నాయి. వీటిలో దళితులు గిరిజనులకు ఎక్కువ ప్రయోజనం కలగాలనేది సీఎం గారి ఆలోచన.

ఎస్సీ ఎస్ డి ఎఫ్, ఎస్టి ఎస్ డి ఎఫ్ ఇంకా ఏ విధంగా అమలు చేస్తే ఎస్సీలు, ఎస్టి లకు మరింత లబ్ధి జరుగుతుందని దానిపై గౌరవ సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను.

ఈ సమావేశంలో సి ఎల్ పి లీడర్ భట్టి విక్రమార్క, విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, హన్మంతు షిండే, రాజయ్య, రేఖా నాయక్, అరూరి రమేష్, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్ చంటి, సుంకే రవి శంకర్, సండ్ర వెంకటవీరయ్య, శంకర్ నాయక్, సీతక్క, గాదరి కిషోర్, రవీంద్ర కుమార్ రామావత్, వి.ఏం అబ్రహం, ఆత్రం సక్కు, కొనింటి మాణిక్య రావు, హరిప్రియ నాయక్, మెతుకు ఆనంద్, అధికారులు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా, ఇతర అధికారుల పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *